Breaking News

అక్కినేని ఫ్యామిలీకి ఇది బ్యూటిఫుల్ మూమెంట్.. నాగ చైతన్యకు కంగ్రాట్స్ చెప్పిన అల్లు అర్జున్


బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా '' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కినేని అఖిల్- జంటగా నటించిన ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రూపొందించారు. తొలి షోతోనే పాజిటివ్ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి తనదైన మాటలతో ఆకట్టుకున్నారు. అక్కినేని అఖిల్‌కి కంగ్రాట్స్ చెప్పిన అల్లు అర్జున్.. ఆయన అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అఖిల్‌లో ఎప్పుడు చూసినా ఓ స్వీట్‌నెస్ ఉంటుందని, అతనికి ఇంత పెద్ద హిట్ రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అక్కినేని ఫ్యామిలీతో తమ ఫ్యామిలీ ప్రయాణం ఎన్నో డికేడ్స్‌గా నడుస్తోందని చెప్పారు. అక్కినేని ఫ్యామిలీకి ఇది బ్యూటిఫుల్ మూమెంట్ అని అల్లు అర్జున్ అన్నారు. రీసెంట్‌గా 'లవ్ స్టోరీ' సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారని, అందుకు గాను టీమ్ అందరికీ, ప్రత్యేకంగా చైతూకి కంగ్రాట్స్ చెబుతున్నానని బన్నీ చెప్పారు. ఇప్పుడు అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' రూపంలో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారని, ఇద్దరు బ్రదర్స్ ఇలా ఒకే సీజన్‌లో ఇంత పెద్ద హిట్స్ కొట్టేయడం నిజంగా అక్కినేని ఫ్యామిలీకి బ్యూటిఫుల్ మూమెంట్ అని తెలిపారు. ఈ మూమెంట్‌లో నాగార్జున ఎంత సంతోష పడుతున్నారో తనకు తెలుసని అల్లు అర్జున్ అన్నారు. ఇకపోతే హీరోయిన్ పూజా హెగ్డే ప్రతి సినిమాతో మరో మెట్టు ఎక్కుతోందని, ఈ సినిమాతో ఏకంగా రెండు మెట్లు ఎక్కేసిందని అల్లు అర్జున్ అన్నారు. సినిమా సినిమాకు ఆమెలో అందంతో పాటు నటనా ప్రతిభ మెరుగుపడుతోందని చెప్పారు. ఆమె తన ఒక్కడికే స్పెషల్ అనుకున్నా కానీ అందరికీ స్పెషల్ అని తెలిసిందని, అందరూ హీరోలకు లక్కీ చార్మ్ పూజా అని అల్లు అర్జున్ అన్నారు.


By October 19, 2021 at 10:40PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/most-eligible-bachelor-success-celebrations-allu-arjun-interesting-comments/articleshow/87142677.cms

No comments