అభిమానులకు ఊరటనిస్తూ.. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఆప్‌డేట్ ఇచ్చిన వైష్ణవ్..
హీరోగా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకాదరణ పొందారు నటుడు సాయి ధరమ్ తేజ్. మెగా కాంపౌండ్ నుంచి హీరోగా వచ్చినప్పటికీ.. ఆయన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. డిఫరెంట్ స్టైల్ యాక్టింగ్‌తో ఆయన ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. అయితే అనుకోకుండా ఆయన సెప్టెంబర్ 10వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కేబుల్ బ్రడ్జిపై వెళ్తుండగా.. ఇసుకలో ఆయన బైక్ స్కిడ్ కావడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ ఉణ్న వాళ్లు ఆయన్ని మొదటి మెడికవర్ ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తేజ్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి.. ఆయన కాలర్ బోన్ విరిగినట్లు గుర్తించారు. ఆ తర్వాత దానికి శస్త్ర చికిత్స చేశారు. అయితే ఇప్పుటికే తేజ్ ఆపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. క్రమంగా ఆయన ఆరోగ్యం మెరుగు అవుతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్.. తన అన్న ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం తన లేటెస్ట్ సినిమా ‘’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉణ్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. సాయి ధరమ్ ఎలా ఉన్నారో మీడియాకు వివరించారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నారని.. ఆయన త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అవుతారు అంటూ ఆయన సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అభిమానులకు అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయనకు ఫిజికల్ థెరపీ జరుగుతోందని ఆయన వివరించారు. ఇక ‘కొండపొలం’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్‌గా సింగ్ నటిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కించారు. ఈ సినిమా 2021, అక్టోబర్ 8వ తేదీన విడుదల కానుంది.
By October 03, 2021 at 12:36PM
No comments