బీచ్ ఒడ్డున అతగాడితో పాయల్ చిల్..! హాఫ్ బికినీలో రచ్చరచ్చ.. రొమాంటిక్ మూడ్‌లో సెల్ఫీ వీడియో
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/86801546/photo-86801546.jpg)
Rx100 సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది . తెలుగు ప్రేక్షకులు మెచ్చిన హాట్ బ్యూటీగా వరుస ఆఫర్స్ పట్టేస్తూ హీరోయిన్‌గా సక్సెస్ అందుకుంది. రీసెంట్‌గా ''RDX లవ్, వెంకీమామ, డిస్కోరాజా'' లాంటి సినిమాలతో తన పాపులారిటీని మరింత పెంచుకున్న ఈ బ్యూటీ.. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటోంది. అలాగే తన ప్రియుడితో గడిపిన క్షణాలను నెటిజన్ల ముందు పెట్టడానికి ఏ మాత్రం మొహమాటపడటం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా పాయల్ తన సోషల్ మీడియా వాల్‌పై పంచుకున్న ఓ సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. పాయల్ ప్రేమ వ్యవహారంపై జనాల్లో జోరుగా చర్చ నడుస్తున్న వేళలోనే ఏకంగా తన లవర్ ఇతనే అంటూ ఓపెన్ అయి అతన్ని పరిచయం చేసింది పాయల్. అప్పటినుంచి ప్రియుడు సౌరవ్ దింగ్రాతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతూ ఆయా ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా అందరి ముందుంచుతోంది. అలా పెళ్లికి ముందే పర్సనల్ లైఫ్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పకనే చెబుతున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన ప్రియుడితో కలిసి బీచ్ ఒడ్డున గడిపిన మధుర క్షణాలను నెటిజన్ల ముందు పెట్టింది. ఈ మేరకు షేర్ చేసిన వీడియోలో పాయల్ హాఫ్ బికినీలో కనిపించడమే గాక, అతనితో చిల్ అవుతూ రొమాంటిక్ మూడ్‌లో కనిపించింది. అంతేకాదు ఓ పాట కూడా పాడి అందరినీ ఆశ్చర్యపర్చింది. ప్రస్తుతం ‘' అనే సినిమా చేస్తోంది పాయల్ రాజ్‌పుత్. ఆది సాయి కుమార్ హీరోగా విజన్ సినిమాస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో భాగంగానే ప్రియుడితో కలిసి షూటింగ్ స్పాట్‌కి వెళ్లిన పాయల్.. అక్కడ ఓ బీచ్ ఒడ్డున ఇలా ఎంజాయ్ చేస్తూ కనిపించింది.
By October 06, 2021 at 09:59AM
No comments