Breaking News

మణిశర్మ ఇంట పెళ్లి సందడి.. సంజనతో ఆయన తనయుడి పెళ్లి! సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్


మెలోడీ బ్రహ్మ ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆయన కుమారుడు, టాలీవుడ్ సంగీత దర్శకుడు పీటలెక్కబోతున్నారు. మహతిని పెళ్లాడబోయే అమ్మాయి సంజనా కలమంజే కూడా ఓ గాయని కావడం విశేషం. ఇటీవలే సీక్రెట్‌గా వీరిద్దరి నిశ్చితార్ధ వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. సాగర్‌ తన నిశ్చితార్థం ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తనకు కాబోయే భార్యపై ప్రేమ కురిపించారు. 'నీతో జీవితం పంచుకోవాలని ఆతృతగా వెయిట్ చేస్తున్నా' అంటూ కొన్ని ఫొటోస్ షేర్ చేశారు. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఆయనకు కంగ్రాట్స్ చెబుతూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక మహతి సాగర్- సంజనల వివాహ వేడుక ఈ నెల 24న చెన్నైలోని ‘ది అకార్డ్ ఫంక్షన్‌ హాల్‌లో జరగనుంది. ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. మహతికి కాబోయే భార్య సంజనా కలమంజే నితిన్ హీరోగా తెరకెక్కిన ‘భీష్మ’ చిత్రంలో ‘హే చూశా’ గీతం ఆలపించింది. తండ్రి మణిశర్మ బాటలో తనయుడు మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడిగా రాణిస్తున్నారు. ''ఛ‌లో, భీష్మ‌, మాస్ట్రో'' చిత్రాలకు సంగీతం అందించారు మహతి.


By October 13, 2021 at 09:28AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/music-director-manisharma-son-swara-sagar-mahathi-marriage-date-fix/articleshow/86983779.cms

No comments