Breaking News

మరి కాసేపట్లో 'మా' ఎన్నికలు.. స్టేషన్ వద్ద మంచు ఫ్యామిలీ హడావిడి.. విరానిక ఫస్ట్ కామెంట్స్


గతంతో పోల్చితే ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ () ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. సాధారణ ఎన్నికలను తలపిస్తూ 'మా' బరిలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్స్ వైరల్ అయ్యాయి. Vs ప్రకాష్ రాజ్ ప్యానల్స్ నేడు తమ బలాబలాలను నిరూపించుకోబోతున్నాయి. నేడు (అక్టోబర్ 10) 'మా' ఎన్నికల కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉదయాన్నే మంచు విష్ణు ప్యానల్ సభ్యులంతా పోలింగ్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. నరేష్, మోహన్ బాబు, మంచు విష్ణు సహా విష్ణు భార్య విరానిక కూడా అక్కడికి చేరుకొని గెలుపుపై ధీమాగా కనిపించారు. ఎగ్జామ్ రాసేశా.. రిజల్ట్ కోసం వెయిటింగ్.. అందరికీ టెన్షన్ ఉండటం కామన్ కానీ నాకైతే ఎలాంటి లేదు అని విష్ణు చెప్పారు. ఇక విరానిక మాట్లాడుతూ మంచు విష్ణు చాలా కష్టపడ్డారని, ఫ్యామిలీతో స్పెండ్ చేయాల్సిన సమయాన్ని కూడా త్యాగం చేసి ఎలక్షన్స్ పట్ల శ్రద్ద పెట్టారని అన్నారు. కాబట్టి విజయం తప్పకుండా ఆయననే వరిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. మోహన్ బాబు అంకుల్ సపోర్ట్‌తో పాటు 'మంచు' ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. ఇక పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్న ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతూ.. మెంబర్స్‌కి ఎన్నుకునే సమయం వచ్చింది. ఇది వాళ్ళ రోజు. వాళ్ళ క్షణం. ఈ సారి పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు.


By October 10, 2021 at 07:44AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/maa-elections-2021-manchu-family-at-polling-station-premises/articleshow/86905711.cms

No comments