Bheemla Nayak నుంచి మరో సాంగ్: క్రేజీగా పవన్ కళ్యాణ్, నిత్య మీనన్.. అంత ఇష్టం ఏందయ్యా నీకు?
పండగ వేళ పవర్ స్టార్ అభిమానులు హుషారెత్తేలా తాజాగా '' నుంచి మరో సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. చిత్రంలో లీడ్ రోల్స్ పోషిస్తున్న పవన్ కళ్యాణ్, లపై ఈ సాంగ్ షూట్ చేశారు. 'అంత ఇష్టం' అంటూ సాగిపోతున్న ఈ పాట పవన్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకలోకాన్ని తెగ ఆకట్టుకుంటూ విడుదలైన నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మళయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్‌గా 'భీమ్లా నాయక్' సినిమా రూపొందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో దగ్గుబాటి రానా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేలో భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' అనే పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటిస్తోంది. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో సక్సెస్ అందుకున్న పవన్.. ఈ సినిమాతో మరో భారీ హిట్ ఖాతాలో వేసుకోనున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. మరోవైపు 'భీమ్లా నాయక్' నుంచి వస్తున్న అప్‌డేట్స్ ఈ మూవీపై ఉన్న అంచనాలకు రెక్కలు కడుతున్నాయి.
By October 14, 2021 at 11:11AM
No comments