Breaking News

Bhabanipur దూసుకెళ్తోన్న మమతా.. నాలుగు రౌండ్లు ముగిసేసరికి 25 వేల ఓట్ల ఆధిక్యత


పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తాను పోటీచేసిన భవానీపూర్‌లో దూసుకెళ్తున్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా.. తన సమీప ప్రత్యర్ధి ప్రియాంక టిబ్రేవాల్‌పై స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. మూడో రౌండ్‌కి 16 వేలకుపైగా ఓట్ల ఆధిక్యతలో ఉన్న మమతా.. నాలుగో రౌండ్‌ ముగిసే సరికి దానిని మరింత పెంచుకున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్‌పై 25 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. భవానీపూర్‌ సహా బెంగాల్‌లో జరిగిన మరో రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులే ముందంజలో ఉంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ కొనసాగుతోంది. జంగీపూర్‌లో టీఎంసీ అభ్యర్థి 1,717 ఓట్ల ఆధిక్యంలోనూ, సెంషేర్‌గంజ్‌లో 3వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో టీఎంసీ అభ్యర్ధి కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడిపోయిన మమతా బెనర్జీ.. ఈసారి భవానీపూర్‌ నుంచి బరిలో ఉన్న విషయం తెలిసిందే. భవానీపూర్‌లో బీజేపీ తరఫున ప్రియాంక టిబ్రేవాల్‌, సీపీఐ(ఎం) నుంచి శ్రీజిబ్‌ బిశ్వాస్‌ పోటీలో ఉన్నారు. సీఎం పీఠాన్ని కాపాడుకోవడానికి భవానీపూర్‌ నుంచి విజయం సాధించడం మమతకు తప్పనిసరి. మరోవైపు ఒడిశాలోని పూరి జిల్లాలో ఉన్న పిపిలి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ స్థానంలో బీజేడీ అభ్యర్థి రుద్ర ప్రతాప్ మహార్తే తన సమీప ప్రత్యర్ధి బీజేపీ నేత అశ్రిత్ పట్నాయక్‌పై 5వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రుద్ర ప్రతాప్ తండ్రి ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప-ఎన్నిక అనివార్యమమయ్యింది. సెప్టెంబరు 30న జరిగిన పోలింగ్‌లో 79 శాతం ఓటింగ్ నమోదయ్యింది.


By October 03, 2021 at 12:23PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mamata-takes-massive-lead-in-bhabanipur-tmc-ahead-in-two-murshidabad-seats/articleshow/86724075.cms

No comments