Breaking News

Anasuya: మంత్రి కేటీఆర్‌కి అనసూయ సూటి ప్రశ్న.. ఇదెక్కడి న్యాయం? బడి బాటపై యాంకర్ ఓపెన్ కామెంట్స్


జబర్దస్త్ యాంకర్‌గా యమ జోష్‌లో ఉన్న అటు సోషల్ మీడియాలోనూ హవా నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్స్, ఫోటో షూట్స్ షేర్ చేయడమే గాక సమాజంలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై స్పందిస్తోంది ఈ బ్యూటీ. ట్రోలింగ్స్ ఎదురైనా, ఎవరేమనుకున్నా తాను చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం అస్సలు దాచుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని విషయాలపై మంత్రి కేటీఆర్‌ని సూటిగా ప్రశ్నించింది ఈ జబర్దస్త్ భామ. దాదాపు రెండేళ్ల పాటు విలయతాండవం చేసిన కరోనా ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పట్టడంతో మెల్లమెల్లగా అని రంగాలు పుంజుకుంటున్నాయి. వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తూ అందరికీ వ్యాక్సిన్ చేరేలా జాగ్రత్త వహిస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే చిన్నపిల్లలకు మాత్రం ఇంకా వ్యాక్సినేషన్ షురూ కాలేదు. కానీ స్కూల్స్ మాత్రం తెరిచేశారు. పిల్లలను పాఠశాలకు పంపించాలని స్కూల్ యాజమాన్యాలు తల్లిదండ్రులను కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూపై అనసూయ రియాక్ట్ అవుతూ వరుస ట్వీట్స్ చేసింది. ''డియర్ కేటీఆర్ సర్.. అసలు లాక్‌డౌన్‌ ఎందుకు వచ్చింది ఆపై అన్‌లాక్‌ ఎందుకు చేశారు అనేది అర్థం చేసుకోవాలి. మనందరికీ వ్యాక్సిన్‌ వేస్తున్నామని కాస్త భరోసా ఇచ్చారు. మరి టీకా వేయాల్సిన వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సంగతేంటి సార్? వాళ్ళను స్కూల్స్‌కి పంపించమని పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులను ఎందుకు బలవంతం చేస్తున్నాయి. పిల్లలు స్కూల్‌లో ఉన్నప్పుడు వారికి ఏమైనా జరిగితే తమ బాధ్యత లేదని పేర్కొంటూ పేపర్‌పై సంతకం కూడా చేయించుకుంటున్నాయి స్కూల్ యాజమాన్యాలు. చెప్పండి.. ఇదెక్కడి న్యాయం.. ఇది ఎంతవరకు సమంజసం. ఎప్పటిలాగే మీరు సరైన మార్గనిర్దేశం చేస్తారని ఆశిస్తున్నా'' అంటూ పోస్ట్ పెట్టింది అనసూయ. ఈ ట్వీట్స్ చూసిన నెటిజన్లు అనసూయ అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నారు.


By October 29, 2021 at 11:10AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ktr-anchor-anasuya-question-on-school-re-open-after-corona-pandemic/articleshow/87356346.cms

No comments