Allu Arjun: ‘పుష్ప’ షెడ్యూల్ ప్లాన్ మార్చేసిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ తాజా చిత్రం ‘పుష్ప’పై చాలా హోప్స్ పెట్టుకున్నారు. అందుకు తగినట్లే బాగా కష్టపడుతున్నాడు. ఎందుకంటే ఇది ఆయన హీరోగా చేస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ. బన్నీతో ఈ సినిమాపై పెద్ద ఆశలను పెట్టుకున్న మరో వ్యక్తి స్టార్ డైరెక్టర్ సుకుమార్. టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా ఆయనకు మంచి పేరే ఉన్నా, పాన్ ఇండియాతో డైరెక్టర్‌గా తన మార్క్ క్రియేట్ చేయడానికి సుకుమార్ వేస్తున్న తొలి అడుగు అనుకోవచ్చు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కొన్ని చిన్న చిన్న సీన్స్, మూడు పాటలు మినహా సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. రెండు భాగాలుగా రూపొందుతోన్న ‘పుష్ప’లో తొలి భాగం ‘ ది రైజ్’ను డిసెంబర్ 17న విడుదల చేయడానికి నిర్మాతలు ఫిక్స్ అయిపోయి డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. ఆలోపు చిత్రీకరణను పూర్తి చేస్తూనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. నిజానికి అల్లు అర్జున్ ఇప్పుడు చేయాల్సిన షెడ్యూల్‌ను అక్టోబర్ 28 నుంచి ప్రారంభించాలని అనుకున్నారట. అది కూడా విదేశాల్లో... అయితే అక్కడి వెళ్లి షూటింగ్ చేసుకుని రావడం కంటే ఇక్కడే సెట్ వేసి పూర్తి చేసేస్తే బెటర్ కదా! అని హీరో సహా దర్శక నిర్మాతలందరూ భావించారు. దాంతో ఇప్పుడు హైదరాబాద్‌లో భారీ సెట్ వేస్తున్నారట. తాజా షెడ్యూల్‌ను ఇక్కడే పూర్తి కానిచ్చేస్తారట. నవంబర్ మూడో వారం లోపు ఈ షెడ్యూల్‌ను పూర్తి చేయాలనేది బన్నీ, సుకుమార్‌లిద్దరూ డెడ్‌లైన్‌గా పెట్టుకున్నారు. ఎందుకంటే తర్వాత పెద్దగా టైమ్ ఉండదు కాబట్టి.. ప్రమోషన్స్‌పై ఫోకస్ చేయాలి. పాన్ ఇండియా మూవీ కాబట్టి భారీగానే ప్రమోషనల్ ప్లాన్స్ చేసుకున్నారట బన్నీ అండ్ టీమ్. నార్త్, సౌత్‌లోని ప్రముఖ నగరాలకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేసుకోవాలని అనుకుంటున్నారట. దానికి సంబంధించిన స్కెచ్ రెడీ అయిపోయిందని టాక్. శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు. రష్మిక అతని ప్రేయసిగా కనిపించనుంది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు, టీజర్‌కు చాలా మంచి స్పందన వస్తుంది. అక్టోబర్ 28న సామి సామి.. అనే మరో పాటను కూడా చిత్ర యూనిట్ విడుదల చేయబోతుంది. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
By October 26, 2021 at 06:33AM
No comments