Allu Arjun: తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్.. విద్యా సంస్థ కమర్షియల్ యాడ్‌లో ఐకాన్ స్టార్
మన టాలీవుడ్ హీరోలు తగ్గేదే లే అని అంటున్నారు. భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉంటూనే కమర్షియల్ బ్రాండ్ వేల్యూను పెంచుకునే పనిలో ప్లాన్ చేసుకుని ముందుకెళుతున్నారు. అందులో భాగంగా ఏమాత్రం వీలున్నా కమర్షియల్ యాడ్స్‌లో నటించడానికి ఓకే చెప్పేస్తున్నారు. టాలీవుడ్‌లో ప్రస్తుతం బ్రాండింగ్‌ను ప్రమోట్ చేయడంలో సూపర్‌స్టార్ మహేశ్ ముందంజలో ఉన్నాడు. అయితే ఇప్పుడు కూడా తగ్గేదే లే అంటున్నారు. అందుకు కారణం, రీసెంట్‌గా ఆయన యాక్ట్ చేసిన యాడ్. ఇంతకీ ఏంటా యాడ్ అనుకుంటున్నారా? వివరాల్లోకెళ్తే.. అల్లు అర్జున్ ప్రముఖ విద్యా సంస్థ శ్రీ చైతన్యకు సంబంధించిన కమర్షియల్ యాడ్‌లో నటించారు. ఈ యాడ్‌ను దసరా సందర్భంగా విడుదల చేశారు. ఈ యాడ్‌లో అల్లు అర్జున్ సదరు చైతన్య విద్యా సంస్థలతో కలిసి నటించారు. ఐఐటీ కోసం శ్రీ చైతన్య అని బన్నీ డైలాగ్ చెబితే, స్టూడెంట్స్ అందరూ తగ్గేదే లే అని చెబుతారు. ఓ విద్యా సంస్థ తమ బ్రాండ్‌ను పెంచుకోవడానికి ఓ అగ్ర హీరోను యాడ్‌లో నటింప చేయడం అనేది ఇదే తొలిసారి. అలాంటి యాడ్‌లో నటించిన హీరో కూడా అల్లు అర్జునే కావడం మరో విశేషం. అయితే సృజనకు విలువ ఇవ్వకుండా ర్యాంకుల గోలే ప్రధానంగా స్టూడెంట్స్‌ను చదువులో ఒత్తిడికి గురి చేసే ప్రైవేటు విద్యాసంస్థల్లో శ్రీ చైతన్య కూడా ఉంటుంది. మరి అలాంటి యాడ్‌లో బన్నీ నటించడం అనేది ఏమైనా విమర్శలకు దారి తీస్తుందేమో చూడాలి. ఇక సినిమాల విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. దీనిలో మొదటి భాగం పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న విడుదలవుతుంది. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ అయితే, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. బన్నీ ఇందులో పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు.
By October 16, 2021 at 10:30AM
No comments