మచ్చల మనిషి కోసం 35 ఏళ్లుగా గాలింపు.. డీఏన్ఏ ఆధారంగా గుర్తించిన పోలీసులు!
కొన్ని దశాబ్దాల పాటు పారిస్‌ను వణికించిన సీరియల్ కిల్లర్ ‘లాగ్రెలే’ (మచ్చల మనిషి) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాజీ మిలటరీ అధికారి ఫ్రాన్సిసో వెరోవె కోసం కొన్నేళ్లుగా పోలీసులు గాలిస్తున్నారు. 1986 నుంచి 1994 మధ్య పారిస్‌లో వరుస హత్యలకు పాల్పడిన వెరోవె.. ముఖంపై మొటిమల మచ్చల వంటివి ఉంటాయి. అందుకే ‘లాగ్రెలే’ అనే నిక్‌నేమ్ పెట్టారు. తొలిసారిగా 1986లో 11 ఏళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో నిందితుడి డీఎన్‌ఏ పోలీసులకు దొరికింది. తర్వాత 1987లో ఓ టీనేజీ బాలికపై అత్యాచారం చేయగా.. పై రెండు సంఘటనల తీరును బట్టి దర్యాప్తు బృందాలు నిందితుడు పోలీస్ అయి ఉంటాడని అనుమానించాయి. అతడిపై నాలుగు హత్య కేసులతో పాటు ఆరు అత్యాచారం కేసులు కూడా ఉన్నాయి. 1986 నాటి అత్యాచారం కేసు దర్యాప్తునకు సంబంధించి అప్పట్లో పారిస్ సమీపంలో ఉన్న 750 మంది మిలటరీ పోలీసులను గుర్తించి విచారణకు హాజరు కావాలని సెప్టెంబరు 24న సమన్లు పంపారు. అయితే, గత నెల 27 నుంచి లాగ్రేలి అదృశ్యం అయ్యాడు. బుధవారం మాంట్ పెల్లర్‌లో ఒక రిసార్ట్ వద్ద ఫ్రాన్సిసో వెరోవె కొన్ని మాత్రలను అతిగా తీసుకుని చనిపోయాడు. తాను ఆత్మహత్య చేసుకొంటున్నట్లు అక్కడ లభించిన లేఖలో పేర్కొన్నాడు. గతంలో లభించిన డీఎన్ఏతో అతడి నమూనాలను పోల్చి చూడగా రెండు ఒకరివిగానే నిర్ధారణ అయింది. గిల్లీ పోలిటీ (38) అనే వ్యక్తి సహా జర్మన్ మహిళ ఇర్మ్‌గార్డ్ ముల్లర్ (20), కరైనే లోరై (19) అనే యువతి హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఆత్మహత్యకు ముందు గతంలో నేరాలకు పశ్చాత్తాపం చెందినట్టు లేఖలో వెల్లడించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ లేఖను ఫ్రెంచ్ మీడియా ధ్రువీకరించలేదు. ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన లాగ్రెలే.. తన నేరాలపై దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇటీవల చేసిన సూచనలను పట్టించుకోకపోవడం వల్లే బలవన్మరణానికి పాల్పడ్డాడని మీడియా తెలిపింది. వెరోవెకు ఇద్దరు పిల్లలు ఉన్నట్టు పేర్కొంది. 90 వ దశకంలో పారిస్ చుట్టుపక్కల జరిగిన నేరాలకు తానే కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. గత 35 ఏళ్లుగా పోలీసులు ఈ నిందితుడి కోసం గాలిస్తున్నారు.
By October 02, 2021 at 01:33PM
No comments