UV Krishnam Raju: ఎలక్షన్ ఆఫీసర్‌కి కృష్ణంరాజు లేఖ... ఇంతకీ అందులో ఆయన ఏం రాశారో తెలుసా?
సీనియర్ కథానాయకుడు, నిర్మాత, రెబల్‌స్టార్ ఎన్నికల ఆఫీసర్‌కు లేఖ రాశారు. ఇంతకీ ఎవరా ఎన్నికల ఆఫీసర్.. ఎందుకు కృష్ణంరాజు లేఖ రాశారు అనే వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 10న ఈ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆరోజున ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణులతో పాటు సి.వి.ఎల్.నరసింహరావు కూడా మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ‘మా’ ఎన్నికల పోటాపోటీగా జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సరిగ్గా జరగడం లేదా? లేకపొతే ఏమైనా అవకతవకలు జరిగాయా? అందుకనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడైన కృష్ణంరాజు ఎన్నికల అధికారిక లేఖ రాశారా? అనే సందేహం రాకమానదు. అయితే ఇవేం కాదు.. ఆయన లేఖ రాయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటో చూద్దాం. అసలు ఆ లేఖలో ఏముందంటే.. ‘‘సీనియర్ ఆర్టిస్ట్‌గా, సీనియర్ సిటిజన్‌గా ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల్లో నేను బయటకు రావడం లేదు. అయితే అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా పాల్గొని ఓటేసే పరిస్థితులు లేవు. కాబట్టి నాకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అధికారాన్ని కల్పించగలరు’’ అని తెలియజేస్తూ ఎన్నికల అధికారికి తన అడ్రస్‌ను తెలియజేస్తూ ఓ లేఖ రాశారు. మరోవైపు కృష్ణంరాజు తన నట వారసుడు ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’లో ఓ అతిథి పాత్రలో నటించారు. ఆ చిత్రానికి ఆయన ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ క్లారిటీ రానుంది.
By September 29, 2021 at 09:41AM
No comments