Trivikram: పక్కా స్కెచ్‌తో చిత్ర నిర్మాణ రంగంలోకి త్రివిక్రమ్ అడుగు పెట్టారా?
మాటల మాంత్రికుడిగా, స్టార్ డైరెక్టర్‌గా త్రివిక్రమ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అగ్ర హీరోలతో ఆయన సినిమాలను రూపొందిస్తున్నారు. ఆయన ఏ సినిమాను డైరెక్ట్ చేసినా అందులో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థో లేక దాని అనుబంధ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్సో భాగస్వామిగా ఉంటుంది. ఈ సంస్థల్లో త్రివిక్రమ్ స్లీపింగ్ పార్ట్‌నర్ అనే వార్త చాలా సందర్భాల్లో వినే ఉంటాం. కానీ ఈసారి త్రివిక్రమ్ రూట్ మార్చినట్లు తెలుస్తుంది. తన శ్రీమతి సాయి సౌజన్యను నిర్మాతగా ఓ సినిమాలో భాగం చేశారు. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించనున్న ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంస్థలో సూర్యదేవర నాగవంశి సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పేరుతో సాయి సౌజన్య కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన వీడియో ప్రోమోను కూడా విడుదల చేశారు. పక్కా ప్రణాళిక వేసుకునే త్రివిక్రమ్ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయమేమంటే, తెలుగు సినిమా శ్రీకారం చుట్టుకున్న రోజునే (1931,సెప్టెంబర్ 15) ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థ పురుడు పోసుకోవడం. ఇప్పుడు దర్శకుడిగా త్రివిక్రమ్ త్వరలోనే మహేశ్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రైటర్‌గా పవన్‌కళ్యాణ్ చిత్రం భీమ్లానాయక్‌కు డైలాగులు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఎన్టీఆర్‌తో త్రివిక్మర్ చేయాల్సిన సినిమా ఆగింది. ఆ గ్యాప్‌లో తన హోం బ్యానర్‌లాంటి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో రూపొందుతోన్న భీమ్లానాయక్‌కు అన్నీ తానై నడిపిస్తున్నారు త్రివిక్రమ్.
By September 15, 2021 at 01:38PM
No comments