Third Wave వచ్చే ఏడాదీ మాస్క్ తప్పదు: నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ హెచ్చరిక
కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి వచ్చే ఏడాదిలో కూడా మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాల్సిందేనని సభ్యుడు డాక్టర్ స్పష్టం చేశారు. కోవిడ్-19పై పోరాటానికి వ్యాక్సిన్లు, సమర్ధవంతమై ఔషధాలు, క్రమశిక్షణ కలిగిన సామాజిక ప్రవర్తనతో పాటు మాస్క్‌లు ధరించడం తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. టీకాల సహా ఔషధాలతో ప్రపంచం అదృష్టవంతమవుతుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ముప్పును కొట్టిపారేయలేమని వీకే పాల్ స్పష్టం చేశారు. దేశం ముప్పు దశలోకి ప్రవేశిస్తోందని ముఖ్యంగా పండగల సీజన్ కావడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘కొంతకాలం మాస్క్ ధరించడం మానొద్దు.. వచ్చే ఏడాది కూడా ధరించాల్సి ఉంటుంది’ అని ఎన్డీటీవీకి సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ వీకే పాల్ హెచ్చరించారు. కరోనాకు సమర్ధవంతమైన ఔషధాలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాకు ఈ నెలాఖారుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో థర్డ్ వేవ్ వస్తుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘థర్డ్ వేవ్ ముప్పును కొట్టిపారేయలేం.. రాబోయే మూడు నాలుగు నెలల్లలో వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం వల్ల హెర్డ్ ఇమ్యూనిటీ పెంచుకోవాలి.. మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.. మహమ్మారిను అడ్డుకోవాలి.. ప్రజలందరూ కలిసికట్టుగా ఉంటే ఇదే సాధ్యమవుతుంది’ అన్నారు. రాబోయే నెలల్లో దసరా, దీపావళి వంటి పండగులు ఉన్నాయి.. ఈ సమయంలో సరిగ్గా వ్యవహరించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘మన ముందు పొంచి ఉంది.. అటువంటి పరిస్థితిలో సిద్ధాంతపరంగా వైరస్ నుంచి బయటపడటానికి మార్గాలు ఉన్నాయి.. ఇందుకు అవసరమైన నిబంధనలు, మార్గదర్శకాలు అందుబాటులో ఉన్నాయి.. వాటిని సమయం వచ్చినప్పుడు అనుసరించాలి.. పాలనా యంత్రాంగం, ప్రజలు సమన్వయంతో మహమ్మారిని అడ్డుకోవచ్చు’ అని సూచించారు.
By September 14, 2021 at 09:45AM
No comments