Sonu Sood: సోనూసూద్ దాతృత్వం.. ప్రజల సేవ కోసం మరో అడుగు


ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో లేదో కానీ.. మాత్రం తన పనిని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తన సేవలను ఆపకుండా చేసుకుంటూ పోతున్నారు. రీల్ హీరో కాదు రియల్ హీరో అని ప్రజలతో పిలిపించుకుంటున్నారు సోనూసూద్. ఆపన్నులకు అండగా నిలబడుతున్నారు. సోనూసూద్ ఇప్పుడు ఈ సేవ చేయడానికి మరో అడుగు ముందుకు వేశారు. ఇకపై చెవి, ముక్కు, గొంతులకు సంబంధించిన ఈఎన్‌టీ ఆపరేషన్స్‌ను ఉచితంగా తన సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈఎన్‌టీ ఆపరేషన్స్‌ను ఉచితంగా అందించబోతుండటం ఆనందంగా ఉంది. శబ్దం, వాసన, రుచిని ఇకపై చక్కగా ఆస్వాదిద్దాం అని సోను తెలిపారు. ఈ సేవలు కావాలనుకున్నవారు సూద్ ఛారిటీ ఫౌండేషన్.ఆర్గ్‌లో లాగిన్ కావాలి. తమ వివరాలతో పాటు ఎలాంటి చికిత్స కావాలనే విషయాలను వెబ్‌సైట్ ద్వారా పొందుపరచాలి. అందులో ఎలాంటి సమస్య ఉందనే విషయంలో సింపుల్‌గా వివరించాలి. తన పేరుపై ఓ స్వచ్చంద సంస్థను స్టార్ట్ చేసిన సోనూసూద్ అవసరంలో ఉన్న పేదలకు విద్య, వైద్య, ఉద్యోగాలకు సంబంధించిన సహాయ సహకారాలను అందిస్తున్నారు. రీసెంట్‌గా ఆయన ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు కూడా జరిగాయి. ఆయన దాదాపు రూ.20 కోట్లు పన్ను కట్టకుండా తప్పించుకున్నారని ఐటీ ఆఫీసర్స్ చెప్పారు. ఆయన రూ.19 కోట్లను సేకరించి అందులో రెండు కోట్ల రూపాయలనే ఉపయోగించారని, మిగతా మొత్తాన్ని తన ఖాతాలోనే ఉంచుకున్నారని కూడా అధికారులు తెలిపారు. అయితే దీనిపై సోనూసూద్ అభిమానులు, ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ చేస్తున్న సోనుపై ఐటీ దాడులను ఖండించారు.
By September 29, 2021 at 08:41AM
No comments