Breaking News

SIIMA Awards 2019: విజేతల పూర్తి వివరాలు.. సమంత, రష్మికలకు టాప్ ప్లేస్


సినిమా రూపకల్పనలో భాగమవుతూ తమ తమ టాలెంట్ చూపుతున్న వారికి ప్రోత్సాహం ఇవ్వడంలో భాగంగా SIIMA అవార్డ్స్ అందిస్తున్నారు. కేవలం దక్షిణాది చిత్రాలకు గుర్తింపు ఇవ్వడం, ఇక్కడి నటీనటులను గౌరవించుకోవడం కోసం ఈ సైమా (సౌతిండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుక చేస్తూ అవార్డ్స్ ఇస్తున్నారు. 2019, 2020లో కరోనా మహమ్మారి కారణంగా ఈ వేడుకలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 18,19 తేదీల్లో హైద్రాబాద్‌లో సైమా వేడుక నిర్వహిస్తూ 2019 సంవత్సరానికి సంబంధించిన అవార్డ్స్ అందిస్తున్నారు. శనివారం రాత్రి అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో విజేతలకు అవార్డ్స్ ఇచ్చి సత్కరించారు. మరి ఈ విజేతల లిస్టు ఓ సారి చూద్దామా.. ‘మహర్షి’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా మహేష్ బాబు అవార్డు అందుకున్నారు. ఇదే చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడిగా అల్లరి నరేష్‌, ఉత్తమ దర్శకుడిగా వంశీ పైడిపల్లి, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్‌, ఉత్తమ గేయ రచయితగా శ్రీమణి అవార్డ్స్ చేజిక్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా 'జెర్సీ' సినిమా అవార్డు అందుకోగా.. ఉత్తమ వినోదాత్మక సినిమాగా 'ఎఫ్ 2' మూవీ అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తమ నటిగా (ఓ బేబి), ఉత్తమ సహాయ నటిగా లక్ష్మి (ఓ బేబి) అవార్డ్స్ గెలుచుకున్నారు. ఉత్తమ గాయకుడిగా అనురాగ్ కులకర్ణి (ఇస్మార్ట్ శంకర్- టైటిల్ సాంగ్), ఉత్తమ గాయనిగా చిన్మయి (మజిలీ- ప్రియతమా) విజేతలుగా నిలిచారు. క్రిటిక్స్‌ విభాగంలో ఉత్తమ నటుడిగా నాని (జెర్సీ), ఉత్తమ నటిగా (డియర్‌ కామ్రేడ్‌) ఎంపికయ్యారు. ఉత్తమ తొలి పరిచయ హీరోగా శ్రీ సింహా (మత్తు వదలరా), ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్‌గా శివాత్మిక రాజశేఖర్ (దొరసాని) ఈ సైమా పురస్కారం గెలుచుకున్నారు. ఉత్తమ ప్రతినాయకుడిగా కార్తికేయ (గ్యాంగ్‌ లీడర్‌), ఉత్తమ హాస్య నటుడిగా అజయ్‌ ఘోష్‌ (రాజు గారి గది-3), ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా సానూ వర్గీస్‌ (జెర్సీ) విజేతలుగా నిలిచారు.


By September 19, 2021 at 08:29AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/siima-awards-2019-event-at-hyderabad-winners-list-here/articleshow/86334852.cms

No comments