Samantha: మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి సమంత గ్రీన్ సిగ్నల్.. ఈసారి రూట్ మార్చిన బ్యూటీ!
అక్కినేని వారి కోడలు సమంత ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. భర్త నాగచైతన్య అక్కినేనితో ఆమెకు మనస్పర్ధలు వచ్చాయని, త్వరలోనే ఇద్దరూ విడిపోతున్నారంటూ ..ఈ క్రమంలో ఆమె ముంబై షిఫ్ట్ అయిపోయిందని రీసెంట్‌గానే వార్తలు వచ్చాయి. దీంతో సమంత ఇక తెలుగు సినిమాలు చేయదా? అని చాలా మందికి ఓ సందేహం కలిగింది. అయితే అలాంటిదేమీ లేదని ఓ తెలుగు సినిమాలో నటించడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇది వరకు బాలకృష్ణతో ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’.. నానితో ‘జెంటిల్‌మన్’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ సినిమాలను నిర్మించారు శివలెంక కృష్ణ ప్రసాద్. పెళ్లి తర్వాత ఉమెన్ సెంట్రిక్ సినిమాలు మాత్రమే చేస్తున్న సమంత ఇప్పుడు కొత్త సినిమాకు ఓకే చెప్పిందంటే అది కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రమే అనడంలో సందేహం లేదు. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రాన్ని ఓ డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువుడుతుందని టాక్. రీసెంట్‌గానే గుణ శేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాను పూర్తి చేసింది సమంత. తర్వాత ఏ సినిమా చేయనుందనే దానిపై క్లారిటీ ఎవరికీ లేదు. చాలా కథలనే వింది సమంత. అందులో డెబ్యూ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడం, మంచి బ్యానర్ కావడంతో సినిమా చేయడానికి ఓకే చెప్పింది. థ్రిల్లర్ జోనర్‌లో రూపొందనున్న ఈ సినిమాను సమంత చెన్నై అమ్మాయి, తమిళ చిత్రాలు చేసి ఉండటం కారణంగా తెలుగుతో పాటు తమిళంలో నిర్మిస్తారా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
By September 18, 2021 at 09:24AM
No comments