Breaking News

Sai Dharam Tej: హాట్సాఫ్ తమ్ముడు.. తమ్ముడు వార్తలు అమ్ముకొని బతికేస్తున్నారు! హరీష్ శంకర్ షాకింగ్ ట్వీట్


ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే దర్శకుల్లో ఒకరు. మనసులో మాటను బయటకు కక్కేయడం ఆయనకు అలవాటు. ఇదే ఆయన్ను చాలా సందర్భాల్లో వార్తల్లో నిలిపింది కూడా. తాజాగా మెగా మేనల్లుడు ఇష్యూలో కూడా డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన ట్వీట్ నెట్టింట రచ్చ చేస్తోంది. తన స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయి ధరమ్ తేజ్, స్కిడ్ కావడంతో అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే యాక్సిడెంట్ ఇష్యూని కొన్ని మీడియా సంస్థలు కాస్త అతి చేస్తూ వార్తలు రాశాయి. అతి వేగం అని కొందరు, ఇద్దరి మధ్య రేసింగ్ అని ఇంకొందరు రాసేశారు. దీంతో ఈ వార్తలపై స్పందించిన హరీష్ ఓ సెటైరికల్ మెసేజ్ పెట్టారు. ''హాట్సాఫ్ తమ్ముడు సాయి ధరమ్ తేజ్. హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్. నీ ఆక్సిడెంట్ వంకతో.. తప్పుడు వార్తలు అమ్ముకొని బతికేస్తున్న అందరు బాగుండాలి. వాళ్లకు ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నాను'' అని పేర్కొంటూ హరీష్ ట్వీట్ పెట్టడం సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్లు పెద్దఎత్తున రియాక్ట్ అవుతున్నారు. ప్రమాదంపై మీడియాలో వస్తున్న కొన్ని తప్పుడు సందేశాలు చూసి విసిగిపోయిన నెటిజన్లు హరీష్ పెట్టిన పోస్ట్‌ని సపోర్ట్ చేస్తున్నారు. 'చింపేశావ్ అన్నా.. నీ టైమింగ్.. నీ డైలాగ్స్.. చెప్పుతో కొట్టినట్టు చెప్పావ్' అంటూ స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తున్నారు. ఇకపోతే హరీష్ చేసిన ఈ ట్వీట్ చూసి ఓ ప్రముఖ మీడియా జర్నలిస్ట్ స్పందిస్తూ.. ''మీడియా వాళ్ళని విమర్శించడం ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది. తప్పుడు కథలు, కథనాలు, హింసను ప్రేరేపించే సినిమాలు తీస్తూ మీరు కోట్లు సంపాదించుకోవచ్చు కానీ తప్పుడు వార్తలు అంటూ తప్పు పడతారు. అతి వేగంతో వెళ్లి మీరు ప్రమాదానికి గురికావడం కాదు ఇతరుల ప్రాణాలు కూడా ముప్పు తెస్తున్నారు'' అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్‌పై కూడా అంతేఘాటుగా రియాక్ట్ అయ్యారు హరీష్. ''నేను తప్పుడు వార్తలు అని క్లియర్‌గా మెన్షన్ చేశాను కదా.. మీరెందుకు అందరికంటే ముందు భుజాలు తడుముకుంటున్నారు. అంటే ఒప్పుకున్నట్టేనా? క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు'' అంటూ మరో షాకిచ్చారు. ''ఇకపోతే మా సినిమాల్లో హింస అన్నారు మాకు సెన్సార్ ఉంది మేము వాళ్లకు జవాబు చెప్పాలి. మీకేముంది మీరు దేనికి జవాబు చెప్పాలో కాస్త చెబుతారా? నేను మీ వ్యవస్థని తప్పు పట్టట్లేదు వ్యవస్థని తప్పుదోవ పట్టించేవాళ్ల గురించి చెబుతున్నాను. దయచేసి ఇష్యూని అర్థం చేనుకోండి'' అని పేర్కొన్నారు హరీష్. దీంతో ఈ ట్వీట్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి.


By September 12, 2021 at 07:25AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sai-dharam-tej-accident-director-harish-shankar-shocking-tweets-on-media/articleshow/86132444.cms

No comments