Ram charan: రామ్‌చరణ్ ఫ్యామిలీలోకి కొత్త సభ్యుడు...ఫొటో వైరల్!
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఫ్యామిలీలోకి కొత్త సభ్యుడు వచ్చాడు. ఇంతకీ ఎవరా అది? అనుకుంటున్నారా? ఓ కుక్కపిల్ల. జంతువులను పెంచుకోవడానికి ఆసక్తి చూపించే చరణ్ రీసెంట్‌గా తన కుటుంబంలోకి రైమ్ అనే కుక్కపిల్లను స్వాగతించారు. . ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రామ్‌చరణ్ అందరికీ తెలియజేశారు. రామ్‌చరణ్ సతీమణి ఇప్పటికే తనకు బ్రాట్ అనే కుక్కను బహుమతిగా అందించింది. ఇవి కాకుండా మరో ఐదు కుక్కులను కూడా చరణ్ పెంచుకుంటున్నారు. అలాగే గుర్రాలను కూడా పెంచుకుంటూ ఉంటాడు. రామ్ చరణ్ పెంచుకుంటున్న గుర్రాల్లో ఒకటి మగధీరలో కనిపించింది. దీని పేరు కాజల్ అని రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలోనూ తెలియజేసిన సంగతి తెలిసిందే. చరణ్ స్నేహితుడు తనకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. రైమ్ రావడానికి కంటే ముందే చెర్రీ దగ్గర ఆరు కుక్కలుండేవి. సాధారణంగా రెండు వేర్వేరు జాతులకు సంబంధించిన కుక్కులు కలిసి ఉండటానికి ఇష్టపడవు. మరిప్పుడు బ్రాట్, రైమ్, ఇతర శునకాలు ఎలా కలిసి ఉండబోతున్నాయో మరి. రైమ్‌ను ప్రేమగా భుజాలపైకెత్తుకుని ముద్దాడుతున్న ఫొటోను రామ్‌చరణ్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించబోయే సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అక్టోబర్ 11 నుంచి పూణేలో షూటింగ్‌ను జరుపుకోనుంది. ఈ పాన్ ఇండియా మూవీలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుంది. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరో వైపు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇది వచ్చే ఏడాది విడుదలవుతుంది. ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నాడు.
By September 26, 2021 at 09:00AM
No comments