Breaking News

Punjab New CM చన్నీ ప్రమాణస్వీకారానికి రాహుల్.. పంజాబ్‌లో కాంగ్రెస్ నయా ఎత్తుగడ!


పంజాబ్ 16వ ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ చన్నీతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి అగ్రనేత సహా పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగు సిద్ధూలు హాజరయ్యారు. అయితే, మాజీ సీఎం మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు సుఖ్ జిందర్ సింగ్ రంధ్వా, ఓపీ సోనీలు పంజాబ్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. పంజాబ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి దళిత వ్యక్తిగా చరణ్‌జీత్ చన్నీ చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకూ జాట్ సిక్కులే సీఎం పీఠాన్ని అధిరోహించగా.. తొలిసారి దళితుడికి ఈ పదవి దక్కింది. డిప్యూటీ సీఎంలలో ఒకరు జాట్ సిక్కు మతానికి చెందిన వ్యక్తి ఒకరు, మరొకరు హిందూ వ్యక్తి ఉన్నారు. చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రమాణస్వీకారానికి ముందు రూప్ నగర్ గురుద్వారాను సందర్శించి ప్రార్థనలు చేశారు. వచ్చే ఏడాది మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగానే చన్నీకి పగ్గాలు అప్పగించింది. చంకౌర్ సాహెబ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న చన్నీ.. కెప్టెన్ అమరీందర్ మంత్రివర్గంలోనూ సభ్యుడిగా ఉన్నారు. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్ () రాజీనామా చేసిన 24 గంటల్లోపే కొత్త సీఎం పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. సునీల్‌ జాఖడ్‌, సుఖ్‌జీందర్‌ సింగ్‌ రంధ్వా, రాజేందర్‌ కౌర్‌ భట్టల్‌ వంటి సీనియర్‌ నేతలను కాదని మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన చరణ్‌జీత్‌కు () కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగించింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పంజాబ్‌కు తొలిసారి సీఎంగా చేసింది. మెజార్టీ స్థాయిలో ఉన్న ఎస్సీ ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు నవజోత్ సింగ్ సిద్ధూతో (Navjot Singh Sidhu) కలుపుకొని పోయే నాయకుడైతేనే వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయం ఖాయమని కాంగ్రెస్ భావిస్తోంది. దాదాపు 20 శాతం మంది జాట్ సిక్కు సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే సీఎం పదవిలో ఉన్నారు. రాష్ట్రంలో 32 శాతానికి పైగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నప్పటికీ రాజకీయంగా ప్రాధాన్యత దక్కలేదు. దళిత సామాజిక వర్గానికి చెందిన వారెవరూ సీఎం పదవిని అలంకరించలేదు. ఇప్పటికే ఆ వర్గంలో ఒకింత అసంతృప్తి ఉంది. దీనికి తోడు ఎస్సీలను ఆకర్షించేందుకు బీఎస్పీతో అకాలీదళ్‌ జట్టు కట్టింది. సాగు చట్టాల విషయంలో రైతుల్లో ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో దళిత ఎస్సీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ సైతం ప్రయత్నాలు ప్రారంభించింది. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ వ్యక్తిని సీఎం చేస్తామని ప్రకటించింది. మరోవైపు చాపకింద నీరులా రాష్ట్రంలో విస్తరిస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీకి సవాల్‌ విసరాలన్నా ఇదే మంచి నిర్ణయమని భావించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయిన చరణ్‌జీత్‌ సింగ్‌ పేరును కాంగ్రెస్‌ ప్రకటించింది.


By September 20, 2021 at 01:22PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/charanjit-channi-sworn-in-as-punjab-chief-minister-rahul-gandhi-attends/articleshow/86363346.cms

No comments