Prabhas - Adi Purush: బాలీవుడ్ స్టార్ భార్యకు ప్రభాస్ అదిరిపోయే ట్రీట్.. ప్రభాస్‌కు థాంక్స్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ
బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరో ప్రభాస్. ఆయన్ని దగ్గర నుంచి చూసిన వారెవరైనా డార్లింగ్ అనే పిలుస్తారు. అంత మంచి మనసున్న వ్యక్తి. సెట్స్‌లో తోటి నటీనటులను ఎంతో బాగా ట్రీట్ చేస్తుంటారు. ప్రత్యేకంగా ఇంటి నుంచి వివిధ రకాలైన వంటలను తయారు చేసి సహ నటులకు భోజనం పెడుతుంటారు ప్రభాస్. ఆయనతో పనిచేసిన హీరోయిన్స్ కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ భార్య, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ సైతం ప్రభాస్ ట్రీట్‌మెంట్‌కు పెద్ద ఫ్యాన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే, సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్ సమయంలో ప్రభాస్, హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీని కరీనా కపూర్‌కు పంపించారు. దాన్ని తన ఇన్‌స్టాలో షేర్ చేసిన కరీనా, ఇది బాహుబలి పంపిన బిర్యాని.. తిందాం.. అంటూ ఫొటోను షేర్ చేయడమే కాకుండా బాహుబలి ప్రభాస్‌కు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పింది. ఆదిపురుష్ సినిమా షూటింగ్ సమయంలో సైఫ్‌తో ప్రభాస్‌కు చాలా మంచి అనుబంధం ఏర్పడింది. అందువల్లనే ప్రభాస్ కరీనాకు బిర్యానీని పంపాడు. ఇప్పటికే రాధేశ్యామ్ పూర్తి చేసిన ప్రభాస్.. ఓవైపు సలార్, మరో వైపు ఆదిపురుష్ సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ఆదిపురుష్ కోసం ప్రభాస్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. ఇందులో సీత పాత్రలో కృతిసనన్ నటిస్తుంది. వచ్చే ఏడాది ఆగస్ట్‌లో ఆదిపురుష్ విడుదలవుతుంది.
By September 26, 2021 at 11:50AM
No comments