Breaking News

Love Story Trailer: యూత్‌‌కి కనెక్ట్ అయ్యే సన్నివేశాలతో వీడియో.. లవ్ స్టోరీకి ఎమోషన్స్ తోడైతే!!


అక్కినేని వారసుడు నటిస్తున్న కొత్త సినిమా ''. యూత్‌ఫుల్ లవ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చి చివరకు సెప్టెంబర్ 24న విడుదలకు రెడీ అయింది. ఈ మేరకు ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్ర యూనిట్.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. 'రేవంత్, మౌనిక లవ్ స్టోరీ థియేట్రికల్ ట్రైలర్ సెప్టెంబర్ 13, ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల కాబోతుంది. వేచి చూడండి' అంటూ ముందే ట్వీట్ చేసి అక్కినేని అభిమానులను అలర్ట్ చేసిన నాగ చైతన్య.. తాజాగా ఈ వీడియోతో ఆకట్టుకున్నారు. ఈ ట్రైలర్‌లోని ప్రతి ఫ్రేమ్, ప్రతి సన్నివేశం యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా కట్ చేశారు. లైఫ్‌‌లో సెటిల్ కావడం కోసం ఇటు నాగ చైతన్య, అటు సాయి పల్లవి పడే కష్టాలు.. ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమను శేఖర్ కమ్ముల తనదైన శైలిలో చూపించారని తెలుస్తోంది. డాన్స్ మాస్టర్‌గా సక్సెస్ కోసం చైతూ పడే తపన ఈ సినిమాలో హైలైట్ పాయింట్ కానుందని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. లవ్ స్టోరీకి ఎమోషన్స్ కలగలిపి డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేశారని తెలుస్తోంది. ఫీల్ గుడ్ 'లవ్ స్టోరీ'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలోని 'సారంగా దరియా' పాట పలు రికార్డులను తిరగ రాసింది.


By September 13, 2021 at 11:25AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/naga-chaitanyas-love-story-trailer-release/articleshow/86160004.cms

No comments