Chiranjeevi - Tamannaah: మరోసారి మెగాస్టార్‌తో జోడి కట్టనున్న మిల్కీబ్యూటీ..!
కుర్ర హీరోలకు పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన చిరు, లూసిఫర్ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ను చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. ఇది కూడా తమిళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే చిత్రం. ఇందులో చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేశ్ నటించబోతుంది. అయితే చిరంజీవికి జోడీగా ఎవరు నటించబోతున్నారనేది అందరిలో ఆసక్తిని రేపింది. లేటెస్ట్ సమాచారం మేరకు తమన్నా భాటియాను హీరోయిన్‌గా ఎంపిక చేశారట. ఇది వరకు చిరంజీవితో సైరా నరసింహారెడ్డిలో తమన్నా నటించింది. ఆ చిత్రంలో చిన్న పాత్రే అయినా, సినిమాకు చాలా కీలకమైన రోల్. ఇప్పుడు మరోసారి మెగాస్టార్‌తో తమన్నా నటించడానికి ఓకే చెప్పినట్లు టాక్. తమిళంలో ఇదే పాత్రను శ్రుతిహాసన్ చేసింది. సైరా నరసింహారెడ్డి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. మరి ఈసారి చిరు-తమన్నా కాంంబో హిట్ కొట్టేనా చూడాలి. ‘భోళా శంకర్’ను చిత్రాన్ని తనదైన స్టైల్లో రిచ్‌గా కమర్షియల్ యాంగిల్‌లో తెరకెక్కించడానికి మెహర్ రమేశ్ సిద్ధంగా ఉన్నాడు. ‘గాడ్ ఫాదర్’ తర్వాత ‘భోళాశంకర్’ సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి చిరంజీవి రెడీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు ఇదే ఏడాదిలో ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో సినిమా రూపొందనుంది. మెగాభిమానులను అలరించేలా చిరంజీవి పాత్రను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసుకుని కథను రూపొందిస్తున్నాడట బాబి.
By September 25, 2021 at 08:06AM
No comments