Breaking News

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై జీవిత ఓపెన్ కామెంట్స్.. బండ్ల గణేష్ భయపడుతున్నారంటూ షాకింగ్ రియాక్షన్


'రిపబ్లిక్' సినిమా ప్రీ రిలీజ్ వేదికపై మాట్లాడిన తీరు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ఇష్యూ మొదలుకొని, ఏపీ ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడుతూ పవన్ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ వర్గాలు భగ్గుమన్నాయి. పవన్ మాట్లాడిన మాటలను తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ కార్యకర్తలు. ఇక పోసాని ఎంటర్ కావడంతో పరిస్థితి మరో స్టేజికి వెళ్ళింది. వ్యక్తిగత దూషణలతో రచ్చ క్రియేట్ అయింది. ఇలాంటి పరిస్థితుల నడుమ ఆ రోజు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ తన అభిప్రాయం బయటపెట్టారు. సినిమా వేరు.. రాజకీయం వేరు అంటూ 'రిపబ్లిక్' సినిమా ప్రీ రిలీజ్ వేదికపై పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరుపై జీవిత స్పందించారు. పవన్ కళ్యాణ్ ఓ పొలిటీషియన్, ఆయనకు ఓ పార్టీ ఉంది.. అలాగే ఆయన ఓ హీరో అని చెప్పిన జీవిత.. ఆయన రాజకీయాల్లో ఉండొచ్చు కానీ మా వరకు ఆయన హీరో మాత్రమే అన్నారు. ఓ హీరోగా పవన్ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని, నిర్మాతలకు, ఇండస్ట్రీకి సాయపడుతూ ఆయన అందరితో ఉంటారని చెప్పారు. సినిమాల పరంగా అయితే పవన్‌తో ఎలాంటి ఇష్యూస్ లేవని జీవిత అన్నారు. అయితే ఓ రాజకీయ నాయకుడిగా ఆయన మాట్లాడిన దానికి, ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పారు. సినిమాలకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని, ఆ రెండిటినీ పోల్చి చూడొద్దని అన్నారు. ఒకే వ్యక్తి అటు పోటీషియన్‌గా, ఇటు నటుడిగా ఉండొచ్చు కానీ రాజకీయాలను సినిమా ఇండస్ట్రీకి అన్వయించొద్దని తెలిపారు. పవన్ కళ్యాణ్ అయితే అలా అన్వయించలేదని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక 'మా' ఎలక్షన్స్ ఇష్యూపై రియాక్ట్ అయిన జీవిత.. , పృథ్వీ తనను టార్గెట్ చేశారని అన్నారు. పోటీలో ఇంతమంది ఉండగా తనపై మాత్రమే ఫోకస్ పెడుతున్నారంటే తాను చాలా హై పొజీషన్‌లో ఉన్నానని, తనను చూసి వాళ్ళు భయపడుతున్నారు కాబట్టే అలా టార్గెట్ చేస్తున్నారని షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. MAA ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున జనరల్ సెక్రటరీగా జీవిత బరిలోకి దిగుతుండగా, మంచు విష్ణు ప్యానల్ తరఫున రఘుబాబు బరిలో ఉన్నారు. ఇక జనరల్ సెక్రటరీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బండ్ల గణేష్ పోటీకి దిగారు. దీంతో ఈ పోటీ రసవత్తరంగా మారింది.


By September 30, 2021 at 08:04AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/jeevitha-reaction-on-pawan-kalyan-speech-at-republic-event/articleshow/86633098.cms

No comments