Breaking News

జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం అల్టిమేటం.. ఐదు రోజుల్లోనే దిగొచ్చిన కేంద్రం!


ట్రైబ్యునళ్లలో ఖాళీలు, నియమకాల విషయంలో కేంద్రం వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన ఐదు రోజుల కేంద్రం చర్యలు ప్రారంభించింది. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT), ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT)లో న్యాయ, సాంకేతిక సభ్యుల నియామకానికి కేంద్రం శనివారం ఆమోదం తెలిపింది. ఎన్‌సీఎల్టీలో మొత్తం 18 మందిని నియమించగా వారిలో 8 మంది న్యాయ, 10 మంది సాంకేతిక సభ్యులు ఉన్నారు. న్యాయ సభ్యుల్లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తెలప్రోలు రజని, బాంబే, మద్రాస్ హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ప్రదీప్ నరహరి దేశ్‌ముఖ్, జస్టిస్ ఎస్ రమాథిలింగం, డీఆర్టీ-3 ప్రిసైడింగ్ ఆఫీసర్ ధర్మేంద్ర సింగ్, పంజాబ్ హరియాణా హైకోర్టు మాజీ రిజస్ట్రార్ జనరల్ హర్మామ్ సింగ్ ఠాకూర్, సేలం జిల్లా రిటైర్డ్ జడ్జ్ పీ మోహన్ రాజ్, న్యాయమూర్తి రోహిత్ కపూర్, జిల్లా న్యాయమూర్తి దీపక్ చంద్రలు ఉన్నారు. కొత్త సభ్యుల పదవీకాలం ఐదేళ్లు లేదా వారికి 65 ఏళ్ల వచ్చే వరకూ ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే, ఐటీఏటీలో 13 మంది న్యాయ సభ్యులను నియమించింది. వీరిలో ఆరుగురు జ్యుడీషియల్, ఏడుగురు అకౌంటెంట్ సభ్యులు. అన్ రిజర్వ్‌డ్ కేటగిరీలో నలుగురు, ఓబీసీ ఒకరు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరిని నియమించింది. ఐదుగురు అకౌంటెంట్ సభ్యులు అన్ రిజర్వ్‌డ్, ఒకరు ఓబీసీ, ఒకరు ఎస్సీ కేటగిరీ. వీరి పదవీకాలం కూడా ఐదేళ్లు ఉంటుందని లేదా 67 ఏళ్లు వచ్చే వరకూ ఉంటారని తెలిపింది. ట్రైబ్యునళ్లలో నియమాకాలు, ఖాళీలను భర్తీచేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సెప్టెంబరు 6 నాటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం తీర్పులు, ఉత్తర్వులను కేంద్రం గౌరవించట్లేదని.. తమ సహనాన్ని పరీక్షిస్తోందని చీఫ్ జస్టిస్ ఎన్బీ రమణ ధర్మాసనం మండిపడింది. ఈ విషయంలో తమ వద్ద కొన్ని మార్గాలు మాత్రమే ఉన్నాయని, వారంలోగా కేంద్రం తమ తీరు మార్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తమ వద్ద కేవలం మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ‘‘కేంద్రం తెచ్చిన ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టంపై స్టే ఇవ్వడం.. ట్రైబ్యునళ్లను రద్దు చేసి హైకోర్టులకు అధికారాలివ్వడం.. స్వయంగా ట్రైబ్యునళ్లలో కోర్టులు నియామకాలు చేపట్టడం.. వీటితో పాటు కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టే ఆప్షన్‌ను కూడా పరిగణించాల్సి వస్తుంది’’ అని సీజేఐ హెచ్చరించారు.


By September 12, 2021 at 08:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-clears-appointments-to-tribunals-after-cji-nv-ramana-warning/articleshow/86132671.cms

No comments