Breaking News

‘శ్యామ్ సింగరాయ్’ విషయంలో నాని కీలక నిర్ణయం.. ఆ పండగే టార్గెట్ చేసుకున్న చిత్ర యూనిట్


నాచురల్ స్టార్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. వరుసగా రెండు మూడు ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టేశారు. ఇప్పటికే టక్ జగదీశ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఫ్యామిలీ ఇంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఓటీటీలో విడుదలై ఫర్వాలేదు అనే టాక్‌ను సంపాదించుకుంది. ఎమోషన్స్, యాక్షన్, తదితర అంశాలు అన్ని ఉన్నప్పటికి.. సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. నాని ప్రస్తుతం శ్యామ్ సింఘరాయ్, అంటే సుందరానికీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతోన్న శ్యామ్ సింఘరాయ్ సినిమా షూటింగ్ గత ఏడాదే మొదలుపెట్టేశారు. ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా (ఎ ఫిల్మ్ బై అరవింద్ ఫేమ్) కథను అందిస్తున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. , , మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందింది. ఇందుకోసం హైదరాబాద్‌లో నిర్మించిన ఓ ప్రత్యేకమైన కోల్‌కతా సెట్‌లో ఈ సినిమా షూటింగ్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని కూడా చాలాకాలమే అవుతోంది. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సినిమా విడుదల వాయిదాపడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు సినిమాను దీపావళికి విడుదల చేయాలి అని హీరో నానితో పాటు చిత్ర యూనిట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే అది థియేటర్‌లో విడుదల చేస్తారా.. లేక ఓటీటీలో విడుదల చేస్తారా.. అనే విషయంలో ఇప్పటివరకూ క్లారిటీ లేదు. మరి దీనిపై మరింత స్పష్టత రావాలి అంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో.. కీలకమైన పాత్రలో జిషు సేన్ గుప్తా, మురళీశర్మ కనిపించనున్నారు.


By September 15, 2021 at 02:25PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nani-new-movie-shyam-singha-roy-to-release-for-diwali/articleshow/86225884.cms

No comments