Breaking News

అఫ్గన్ విడిచి వెళ్లడానికి ముందు అష్రాఫ్ ఘనీ అలా అన్నారు.. అమెరికా కీలక వ్యాఖ్యలు


రాజధాని కాబూల్‌ను తాలిబన్లు ఆక్రమించుకోడానికి ముందు అఫ్గన్ మాజీ అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. అయితే, పారిపోవడానికి ముందు రోజు రాత్రే అష్రాఫ్ ఘనీ తనతో మాట్లాడినట్టు తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకేన్‌ వెల్లడించారు. అఫ్గన్ మీడియా టోలో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్లింకెన్ ఈ విషయం బయటపెట్టారు. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోవడానికి సహకరించారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. చావడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారని అన్నారు. ఈ ఇంటర్వ్యూ వీడియోను టోలో న్యూస్ విడుదల చేసింది. జర్నలిస్ట్ లాట్‌ఫుల్లా నజఫిజాదా ‘ అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోవడానికి సహకరించారా’ అని ప్రశ్నించారు. దీనికి బ్లింకేన్ సమాధానం ఇస్తూ.. ‘ఆ రోజు రాత్రి నాతో మాట్లాడిన ఘనీ.. పోరాటంలో చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు’ అని తెలిపారు. ప్రస్తుతం అఫ్గన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌లో ఆశ్రయం పొందుతున్నారు. తాజాగా తాను దేశం విడిచి పారిపోవడంపై అఫ్గన్ ప్రజలకు ఘనీ క్షమాపణలు చెప్పారు. అధికారిక భవనం భద్రత విభాగం సలహా ప్రకారమే తాను దేశం విడిచి వెళ్లిపోయినట్టు తెలిపారు. ‘ఆగస్టు 15 న అకస్మాత్తుగా తాలిబాన్లు రాజధాని నగరంలోకి ప్రవేశించిన తరువాత కాబూల్ విడిచి వెళ్లిపోయినందకు నేను అఫ్గన్ ప్రజలకు వివరణ ఇవ్వాలి’ అని ట్విట్టర్‌లో తెలిపారు. తాను దేశంలో ఉండిపోతే 90వ దశకంలోని అంతర్యుద్ధం సమయంలో ఎదుర్కొన్న భయంకరమైన రక్తపాతం తప్పదని హెచ్చరించారన్నారు. కాబూల్‌ను వీడటం చాలా క్లిష్టమైన నిర్ణయమని, కానీ కాబూల్, ప్రజల ప్రాణాలకోసం నాకు మరో దారి కనిపించలేదన్నారు. తాను మిలియన్ డాలర్లు తీసుకెళ్లానని వచ్చిన ఆరోపణలను ఖండించారు. ‘స్థిరత్వం, శ్రేయస్సును నిర్ధారించకుండా నా అధ్యాయం నా పూర్వీకుల మాదిరిగానే విషాదంతో ముగిసింది. నేను దానిని భిన్నంగా ముగించలేనందుకు అఫ్గన్ ప్రజలకు క్షమాపణలు కోరుతున్నాను’ అని వెల్లడించారు. తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన మర్నాడే ఘనీ ఈ ప్రకటన చేశారు. తాలిబన్ ప్రభుత్వంపై తమకు ఆందోళన నెలకుంది, కానీ వారి చర్యల ఆధారంగా నిర్ణయం ఉంటుందని అమెరికా ప్రకటించింది. తాలిబన్లు తమ వాగ్దానాలు, హామీలను నిలబెట్టుకునేలా ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఐరోపా సమాఖ్య సహా మరో 20 దేశాలతో బ్లింక్లేన్ విర్చువల్‌గా సమావేశమైన చర్చించారు.


By September 09, 2021 at 09:14AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/afghanistan-ex-president-ashraf-ghani-told-talks-us-secretary-of-state-the-night-before-exit/articleshow/86056213.cms

No comments