Breaking News

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆగని 'పుష్ప' లీక్స్.. పగలగొట్టేస్తాం అంటున్న సుక్కు టీమ్! తగ్గేదే లే..


హీరోగా రూపొందిస్తున్న పాన్ ఇండియా మూవీ ''. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ రేంజ్‌లో ఈ మూవీ రూపొందిస్తున్న సుక్కు.. అధికారిక పోస్టర్స్, వీడియోస్ తప్పితే షూటింగ్ దశలో ఎక్కడా ఎలాంటి లీక్స్ జరగకూడదని జాగ్రత్త పడుతున్నారట. అయితే ఎక్కువభాగం అవుట్ డోర్ షూటింగ్స్ జరుగుతుండటంతో లీకుల పర్వం ఆగడం లేదు. దీంతో సుక్కు టీమ్ ఓ కొత్త ఆలోచన చేసింది. అయితే ఆ ఆలోచన కూడా లీక్ కావడం విశేషం. 'పుష్ప' షూటింగ్ ప్రారంభం నుంచి ఏదో ఒక లీక్ వైరల్ అవుతూనే ఉంది. బన్నీ మాసిన గెడ్డం లుక్స్, అనసూయ లుక్స్ ఇలా ఎన్నో బయటకొచ్చాయి. ఇక మొన్నటికి మొన్న అల్లు అర్జున్‌ రోడ్డు పక్కన ఉన్న చిన్న హోటల్లో టిఫిన్‌ చేసిన దృశ్యాలతో పాటు వర్షం పడటంతో మూవీ టీం కాకినాడకు వెళ్లిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో బాగా విసిగిపోయిన చిత్రయూనిట్ ఓ కొత్త ఆలోచన చేసి షూటింగ్ స్పాట్‌లో ''ఫొటోలు, వీడియోలు తీసినచో సెల్ ఫోన్ పగలగొట్టబడును'' అని బోర్డులు పెట్టారు. అయితే వీటిని కూడా కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం చూస్తుంటే సుక్కుని ఈ సమస్య ఎంతలా వెంటాడుతుందో అర్థం చేసుకోవచ్చు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పుష్పరాజ్ లుక్స్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్ ఇలా ఏ ఒక్కటీ మిస్ కాకుండా తనదైన స్టైల్‌లో కథను ప్రెజెంట్ చేయబోతున్నారట సుకుమార్. చిత్రంలో అనసూయ రోల్ కీలకం కానుందని సమాచారం.


By September 17, 2021 at 07:50AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sukumar-plans-to-stop-allu-arjuns-pushpa-movie-leaks/articleshow/86281126.cms

No comments