Breaking News

రెచ్చిపోయి బ‌లి ఇచ్చిన ఫ్యాన్స్‌... కేసు న‌మోదు చేసిన పోలీసులు


దేనికైనా ఓ ప‌రిమితి ఉంటుంది. ఆ హ‌ద్దు దాటితే స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌నేది ఎవ‌రూ కాద‌న‌లేరు. ఈ విష‌యాన్ని ఇప్పుడు ఓ స్టార్ హీరో కూడా అవున‌న‌క త‌ప్పడం లేదు. ఇంత‌కీ ఎవ‌రా స్టార్ హీరో.. ఆయ‌న‌కు వ‌చ్చిన స‌మ‌స్య ఏంటి? అనే వివ‌రాల్లోకెళ్తే.. క‌న్న‌డ స్టార్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడే. తెలుగులో రాజ‌మౌళి ఈగ చిత్రంతో పాటు బాహుబ‌లిలో గెస్ట్ రోల్ చేశాడు. అలాగే సైరా న‌ర‌సింహారెడ్డిలో చాలా కీల‌క‌మైన పాత్ర‌లో మెప్పించాడు. ఈ హీరోగారి పుట్టిన‌రోజు సెప్టెంబ‌ర్ 2. ప్ర‌తి ఏటా ఆయ‌న అభిమానులు సుదీప్ పుట్టిన‌రోజును ఎంతో ఘనంగా నిర్వ‌హిస్తుంటారు. ఫెక్సీలు క‌ట్ట‌టం, కేకులు కోయ‌టం, అన్న‌దానాలు చేయ‌టం వంటి కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హిస్తుంటారు. అయితే ఈ ఏడాది కిచ్చా సుదీప్ బ‌ర్త్ డే వేడుక‌ల్లో ఈ అభిమానులు చేసిన హ‌డావుడి హ‌ద్దు మీరింది. బళ్లారిలోని సండూరి తాలుకా బండ్రి అనే ప్రాంతం ద‌గ్గ‌ర సుదీప్ అభిమానులు క‌టౌట్ క‌ట్టి దాని ముందు ఓ దున్న‌పోతుని బ‌లిచ్చారు. స‌ద్భావ‌న పేరుతో ఇలా జీవ హింస చేయ‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుని సుమోటాగా కేసును న‌మోదు చేశారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. కిచ్చా సుదీప్ ప్ర‌స్తుతం విక్రాంత్ రోణ అనే భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు భాష‌ల్లో సినిమాను భారీ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు సన్నాహాలు చేస్తున్నారు. మ‌రి ఈ విష‌యంపై అటు సుదీప్ కానీ, ఆయ‌న అభిమాన సంఘాలు కానీ ఏమీ స్పందించ‌లేదు. మరోవైపు కిచ్చా సుదీప్‌.. త‌న స్వ‌గ్రామం గౌడ‌గేరెలో ప్ర‌తిష్టించిన‌ 65 అడుగుల ఛాముండేశ్వ‌రి దేవి ఆల‌యాన్ని సంద‌ర్శించారు.


By September 05, 2021 at 11:28AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/police-filed-a-case-against-kiccha-sudeep-fans-for-their-over-acting/articleshow/85942971.cms

No comments