‘అసలు ఆమెకు ఎముకలు ఉన్నాయా.. ’ ‘లవ్‌స్టోరి’పై ఆసక్తికర కామెంట్స్ చేసిన మహేష్ బాబు
అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా అడుగుపెట్టి ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నాగచైతన్య. విభిన్నమైన రీతిలో సినిమాలు చేస్తూ.. తమ ఇంటి వారసత్వాన్ని కాపాడుతున్నాడు అతను. అయితే నాగచైతన్యను వెండితెరపై అభిమానులు చూసి చాలాకాలమే అయింది. చివరిగా ‘మజిలీ’ సినిమాతో ఆయన ప్రేక్షకులను పలకరించారు. ఆ తర్వాత దర్శకత్వంలో ఆయన ‘’ అనే సినిమా చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చాలాకాలమే అయింది. అయితే సినిమా విడుదలకు మాత్రం అడుగడుగునా అడ్డంకులే ఏర్పడ్డాయి. హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నిజానికి గత ఏడాదే విడుదల కావాల్సింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌లు, పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు మెరుగు కావడంతో గత శుక్రవారం ఈ సినిమా విడుదల అయింది. మంచి పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా దూసుకుపోతోంది. డ్యాన్స్ ఆధారంగా రూపొందిన ఈ సినిమాపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమాను మెచ్చుకుంటూ పలు ట్వీట్లు చేశారు. ప్రధానంగా ఆయన హీరో నాగచైతన్య, సాయి పల్లవిలను అభినందించారు. సాయిపల్లవి డ్యాన్స్‌ని మెచ్చుకున్న మహేష్.. ‘అసలు ఆమె శరీరంలో ఎముకలు ఉన్నాయా’ అంటూ సరదాగా కామెంట్ చేశారు. ఇక సంగీత దర్శకుడు పవన్ సీహెచ్, నిర్మాతలు అందరిని ఆయన అభినందించారు. అయితే సూపర్‌స్టార్ మహేష్ బాబు తమ హీరో సినిమాను ఎంకరేజ్ చేయడంపై నాగచైతన్య అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘సూపర్‌స్టార్ థాంక్యూ’ అంటూ వాళ్లు కామెంట్స్ పెడుతున్నారు.
By September 26, 2021 at 12:27PM
No comments