Breaking News

ఢిల్లీ: అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు రహస్య సొరంగం.. స్పీకర్ వాదన తోసిపుచ్చిన చరిత్రకారుడు!


ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో బ్రిటిష్‌ కాలం నాటి సొరంగం బయటపడిlనట్టు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ శుక్రవారం వెల్లడించారు. అసెంబ్లీ భవనం నుంచి ఎర్రకోటకు చేరుకునేలా ఈ సొరంగాన్ని నిర్మించినట్లు తెలుస్తోందని స్పీకర్‌ రామ్‌నివాస్‌ గోయల్‌ తెలిపారు. ఈ సొరంగం పొడవు దాదాపు 6 కిలోమీటర్లు ఉంటుందని, ఇది ఇక్కడ ఉన్నట్లు చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోందని అన్నారు. దీంతోపాటు అసెంబ్లీ ప్రాంగణంలో స్వాతంత్య్ర సమరయోధులను ఉరితీయడానికి నాటి బ్రిటిషర్లు వాడిన గది కూడా ఉందని గోయల్‌ వెల్లడించారు. పాడుబడిన ఆ గదిని పునరుద్దరించిన వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం లేదా స్వాతంత్య్ర దినోత్సవం నాటికి పర్యాటకుల సందర్శనకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశ రాజధానిని 1912లో కోల్‌కతా నుంచి ఢిల్లీకి మార్చిన తర్వాత ప్రస్తుత అసెంబ్లీ భవనాన్ని సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీగా వినియోగించారని, ఆ తర్వాత 1926లో దాన్ని కోర్టుగా మార్చారని చెప్పారు. తిరుగుబాటుదారులను నుంచి రహస్యంగా కోర్టుకు తీసుకురావడానికి బ్రిటిష్ పాలకులు ఈ సొరంగాన్ని వినియోగించేవారని వివరించారు. ప్రస్తుతం సొరంగం పూడుకుపోయి ముఖద్వారమే కనిపిస్తోందని, అయితే దాన్ని మళ్లీ పునర్నిర్మించే ఉద్దేశం లేదని స్పీకర్ . దాని ఉపరితలంపైన మెట్రో రైలు మార్గాలతో పాటు మరెన్నో నిర్మాణాలు చేపట్టడమే అందుకు కారణమన్నారు. సొరంగంపై చరిత్రకారులు వాదనలను ధ్రువీకరించలేదని ఆయన అంగీకరించారు. అసెంబ్లీ ఫ్లోర్ కింద ఉన్న నిర్మాణం గురించి అధికారులు ఇంకా లిఖిత లేదా చారిత్రక ఆధారాలను కనుగొనలేదన్నారు. అయితే, స్పీకర్ వాదనలను రణా సఫ్వీ అనే చరిత్రకారుడు తోసిపుచ్చారు. ‘1912లో నిర్మించిన ఢిల్లీ విధానసభ భవనానికి ఎర్రకోటతో అనుసంధానించే ఒక సొరంగ మార్గం ఉండడం చాలా అసంభవం’ అన్నారు. ‘ఎర్రకోటను 1639-48 మధ్య నిర్మించారు... ఈ కోటలో సొరంగాలు సహా ఏదైనా నిర్మాణాల ఉనికి మొదటి 100, 200 ఏళ్లలో జరిగుండేది.. కాబట్టి, బయటపడిన సొరంగం తప్పనిసరిగా మరేదైనా దానికి ఉపయోగించి ఉండాలి.. దీనిని ఎర్రకోట వరకు అనుసంధానం చేయలేం’ అన్నారు.


By September 04, 2021 at 10:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mysterious-tunnel-found-in-assembly-connects-to-red-fort-says-delhi-speaker/articleshow/85919093.cms

No comments