Bellamkonda Ganesh: కమల్ టైటిల్‌తో ఎంట్రీ.. భారీ స్కెచ్‌తో రంగంలోకి దిగుతున్న యువహీరో
టాలీవుడ్‌కి త్వరలోనే మరో కొత్త హీరో పరిచయం కానున్నారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు మరికొన్ని రోజుల్లో హీరోగా వెండితెరపై కనిపించనున్నారు. ఇప్పటికే ఆయన సోదరుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘అల్లుడు శీను’ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఆయన నటించిన సినిమాలు వినోదాత్మకంగా ఉన్నప్పటికీ.. ఇప్పటివరకూ ఆయన ఖాతాలో ఒక బ్లాక్‌బస్టర్ హిట్ పడలేదు. దీంతో బాలీవుడ్‌పై కన్నేశారు సాయి శ్రీనివాస్.. తెలుగులో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాను ఆయన హిందీలో రీమేక్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయింది. ఎస్‌ఎస్ రాజమౌళి స్వయంగా ఈ వేడుకలో పాల్గొని తొలి షాట్‌కు క్లాప్ కొట్టారు. ఇక హిందీలో ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా రెజీనా కస్సాండ్రా హీరోయిన్‌గా నటిస్తోందని టాక్. అయితే ఇప్పుడు గణేష్ కూడా భారీ స్కెచ్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. అందుకోసం ఆయన ఏకంగా యూనివర్సల్ హీరో కమల్‌హాసన్ సూపర్‌హిట్ సినిమా టైటిల్‌ని ఎంపిక చేశారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఆయన తొలి సినిమాకు ‘’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. మంగళవారం ఈ సినిమా టైటిల్‌తో పాటు గణేష్ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ని కూడా వదిలింది చిత్ర యూనిట్. ఇందులో ఆయన ఫార్మల్ డ్రెస్‌లో, భుజానికి ఓ బ్యాగ్ వేసుకొని ఉండటం మనం చూడొచ్చు. ఇక ఈ సినిమాలో గణేష్ పాత్ర పేరు ‘బాలమురళి’ అంటూ చిత్ర యూనిట్ తెలిపింది. హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా.. డీఓపీగా సూర్య తేజ పని చేయనున్నారు.
By September 14, 2021 at 11:24AM
No comments