Bandla Ganesh - Posani: పవన్‌కు సపోర్ట్‌గా రంగంలోకి దిగిన బండ్ల గణేశ్.. బ్లాంక్ చెక్ ఇస్తాన్న పోసాని


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, జగన్‌పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి రెండు వైపుల నుంచి మాటల యుద్ధం మొదలైంది. ముఖ్యంగా వైకాపా కార్యకర్త అయిన పోసాని కృష్ణమురళికి, జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులకు మధ్య మాటలు హద్దులు దాటేసి పరస్పర దూషణలకు వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్‌ను దూషించిన పోసాని కృష్ణమురళిపై పవన్ అభిమానులు దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోసానిని ఆయన ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా పోసాని తన ప్రాణాలకు పవన్ అభిమానుల నుంచి ప్రాణహాని ఉందని, తాను చనిపోతే పవన్ కళ్యాణే కారణమని, తాను రేపు పోలీసులకు పవన్‌పై ఫిర్యాదు చేస్తానని మీడియాతో మాట్లాడారు. ఇక పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి ఆయనకు మద్ధతుని తెలియజేస్తూ తాజాగా ఆయన అభిమానిగా చెప్పుకునే నిర్మాత బండ్ల గణేశ్ రంగంలోకి దిగాడు. పోసాని కృష్ణమురళి గతంలో పవన్ కళ్యాణ్‌ను పొగుడుతూ చేసిన వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో పోసాని పవన్‌ను పొగుడుతూ తెలుగులోనే కాదు, ఇండియాలోనే అత్యంత క్రేజ్ ఉన్న హీరో అని అన్నారు. ఆయన సినిమాల్లో నటిస్తానంటే తాను బ్లాంక్ చెక్ ఇస్తానని అన్నారు. దాంట్లో పవన్ ఎంత రెమ్యునరేషన్ కావాలంటే అంత రాసుకోవచ్చునని అన్నారు. వీడియో పోస్ట్ చేసిన బండ్ల గణేష్ జస్ట్ ఆస్కింగ్ పోసానిగారు అని కామెంట్ పెట్టారు. రెండు రోజులుగా గొడవలు జరుగుతున్న మాటల యుద్ధం మరోస్థాయికి చేరుకుంది. ఇప్పుడు పవన్ వీరాభిమాని అయిన బండ్ల గణేశ్ రంగంలోకి దిగడంతో ఈ మాటల యుద్ధం పెరుగుతుందనిపిస్తుంది కానీ..తగ్గేలా కనిపించడం లేదు. మరి బండ్ల గణేష్ పోసానిపై ఇంకా ఏమైనా మాట్లాడుతారా? లేక పోసానియే బండ్లకు కౌంటర్ ఇస్తాడేమో చూడాలి.
By September 28, 2021 at 11:24PM
No comments