Breaking News

Tsunami ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. పసిఫిక్ తీరంలో సునామీ హెచ్చరికలు


ఫిలిప్పీన్స్‌లో గురువారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్ ఆగ్నేయ తీరంలోని పొందగిటాన్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు తెలిపింది. పొందగిటాన్‌కు తూర్పుదిక్కుగా 63 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొంది. భూమికి 65.6 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టు వివరించింది. ఈ నేపథ్యంలో యూఎస్‌ హెచ్చరిక కేంద్రం.. ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఫిలిప్పీన్స్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆప్‌ వోల్కనాలజీ, సిస్మాలజీ (ఫివోవోల్క్స్) భూకంప నష్టాన్ని అంచనా వేస్తున్నట్టు ప్రకటించింది. దేశానికి సునామీ ముప్పు ఉందని తెలిపింది. వల్ల తమ పశ్చిమ తీరం లేదా హవాయిలకు ఎటువంటి సునామీ ముప్పు లేదని అమెరికా జాతీయ వాతావరణ సేవల కేంద్రం, హవాయి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ వేర్వేరు ప్రకటనలో వెల్లడించాయి. భౌగోళికంగా పసిఫిక్ తీరంలో ఉన్న ఫిలిప్పీన్స్.. తరుచూ భూకంపాలను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం చోటు చేసుకోవడంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఆస్ట్రేలియా వాతావరణ ఏజెన్సీ తెలిపింది. ఈ భూకంపం కారణంగా సునామీ సంభవించనున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియా ప్రధాన భూభాగానికి 550 కి.మీ. దూరంలోని లార్డ్ హొవె ఐలాండ్‌కు (Lord Howe Island) ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేసినా... తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు.


By August 12, 2021 at 08:41AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/strong-earthquake-strikes-philippines-us-geological-survey-warns-tsunami-threat/articleshow/85261444.cms

No comments