Breaking News

Olympics : పీఎం, సీఎంలను పట్టించుకోలేదు.. చిరును మాత్రం గుర్తించారు.. దటీజ్ మెగాస్టార్!


మెగాస్టార్ రేంజ్ గురించి, ఆయన స్థాయి, ఖ్యాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ మధ్య కొంత మంది సెలెబ్రిటీలు కూడా చిరు స్థాయి గురించి కామెంట్ చేశారు. సీఎం పదవి కన్నా మెగాస్టార్ పదవి ఎంతో గొప్పదని అన్నారు. అలా చిరంజీవి స్థాయి గురించి సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. కేవలం సినిమాలతోనే కాదు.. సామాజిక బాధ్యతను పంచుకుని, ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే ఆ గుణం వల్లే ఎన్నో కోట్ల మందికి చిరు దగ్గరయ్యారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇక ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంక్‌లతోనూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు. అయితే తాజాగా చిరు రేంజ్ గురించి ట్విట్టర్‌లో చర్చ నడుస్తోంది. నిన్న పీవీ సింధు ఆటలో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచారు. చైనా క్రీడాకారిణి మీద గెలిచి కాంస్యాన్ని సొంతం చేసుకున్నారు. అలా వరుసగా రెండు సార్లు ఒలంపిక్స్ పతకాలు గెలిచిన భారత మొట్టమొదటి మహిళగా పీవీ సింధు రికార్డులు క్రియేట్ చేశారు. రియో, టోక్యో ఒలింపిక్‌లో పీవీ సింధు రజతం, కాంస్యాన్ని సొంతం చేసుకున్నారు. టోక్యో ఒలింపిక్‌లో కాంస్యాన్ని సొంతం చేసుకున్న పీవీ సింధుకు భారతదేశం మొత్తం ప్రశంసలు కురిపించింది. పీఎం నరేంద్ర మోదీ, అన్ని రాష్ట్రాల సీఎంలు, దేశ ప్రజలు అభినందనలు తెలియజేశారు. చిరంజీవి కూడా తన స్టైల్లో కంగ్రాట్స్ చెప్పారు. అయితే ఇలా ఎంతో మంది ట్వీట్లు వేశారు. పీఎం, సీఎం ట్వీట్లను కూడా పట్టించుకోని ఒలింపిక్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్.. మెగాస్టార్ చిరు వేసిన ట్వీట్‌ను మాత్రం పట్టించుకుంది. చిరు వేసిన ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన ఒలింపిక్ సంస్థ.. ఆమె ఎంతో స్ఫూర్తివంతురాలు అంటూ పేర్కొంది. ఇక ఇది చూసిన మెగా అభిమానులు బాస్ రేంజ్ ఇదిరా అంటూ కాలర్ ఎగిరేస్తున్నారు.


By August 02, 2021 at 10:37AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/olympics-twitter-handle-give-reply-to-chiranjeevi-on-pv-sindhu-tweet/articleshow/84965335.cms

No comments