Breaking News

‘పెళ్లి సందD’ టైటిల్ సాంగ్ వచ్చేసింది.. దర్శకేంద్రుడి స్టైల్‌లో పాట అదిరిపోయిందిగా..


సీనియర్ డైరెక్టర్, దర్శకేంద్రుడు దర్శకత్వం పర్యవేక్షణలో‘’ సినిమా రూపొందతున్న సంగతి తెలిసిందే. గత 25 ఏళ్ల క్రింద ఇదే ‘పెళ్లి సందడి’ పేరుతో సినిమా తీసి రికార్డులు తిరగరాసిన ఆయన.. ఇప్పుడు మోడ్రన్ ‘పెళ్లి సందD’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 1996లో విడుద‌లై ఏడాది పాటు ప్ర‌ద‌ర్శించ‌బ‌డి అద్భుత‌ విజ‌యాన్ని సాధించ‌డ‌మే గాక బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ హిట్‌గా నిలిచి పాతికేళ్లుగా శ్రోతలను అట్రాక్ట్ చేస్తోంది నాటి ‘పెళ్లిసంద‌డి’రాఘవేంద్రుడి టేకింగ్, కీరవాణి మ్యూజిక్ అన్ని వర్గాల ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. ఇప్పుడు ఈ ‘పెళ్లి సందD’లో కూడా ఇదే కాంబో రిపీట్ అవుతోంది. అయితే ఈసారి మాత్రం సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించడం లేదు. గౌరీ రోనంకి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక పాత సినిమాలో హీరోగా నటించిన శ్రీకాంత్ తనయుడు ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా.. హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేశారు. ‘ప్రేమంటే ఏంటీ..’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘బుజ్జులు’ అనే మరో రొమాంటిక్‌ సాంగ్‌ని కూడా వదిలారు. తాజాగా ఈ సినిమా నుంచి మరోపాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. అదే ‘పెళ్లి సందD’ టైటిల్ సాంగ్. రాఘవేంద్ర రావు స్టైల్‌లోనే ఈ పాటను చిత్రీకరించారు. ఓ పెళ్లి వేడుకకు సంబంధించి హీరో, హీరోయిన్లు కలిసి పాడే పాటే ఇది. ఇక కీరవాణీ ఈ పాటకు అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రాఫి చేయగా.. హేమచంద్ర, దీపు, రమ్య బెహ్రా ఆలరించారు. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను అలరిస్తోంది. ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్‌, ఆర్కా మీడియా వ‌ర్క్స్ బ్యానర్స్‌పై కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌ సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీకి మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.


By August 12, 2021 at 12:23PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pelli-sandadi-movie-title-song-released/articleshow/85265241.cms

No comments