Breaking News

CAA చట్టం అవసరం ఇప్పుడు అర్ధమవుతుందా? కేంద్ర మంత్రి సంచలన వ్యాాఖ్యలు


అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు మొదలుకావడంతో అక్కడ పరిస్థితి దిగజారుతోంది. దీంతో అక్కడున్న విదేశీయులే కాదు అఫ్గన్ పౌరులు కూడా తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఫ్గన్ పరిణామాలపై ట్విట్టర్ ద్వారా స్పందించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి.. అక్కడ సిక్కులు, హిందువులు విపత్కర పరిస్థితుల్లోకి జారుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆవశ్యకతను ఈ పరిస్థితులు తెలియజేస్తున్నాయని వివరించారు. కాబుల్‌ నుంచి 168 మంది భారత్‌‌కు చేరుకున్నారన్న వార్తను ట్వీట్‌ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మన పొరుగున ఉన్న అఫ్గన్‌లో ఇటీవలి పరిణామాలు అక్కడ సిక్కులు, హిందువులు దుర్బర పరిస్థితిలో ఉన్నారు.. పారసత్వ సవరణ చట్టం అమలు ఎందుకు అవసరమే తెలుపుతుంది’అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2019 డిసెంబరులో తీసుకొచ్చిన సీఏఏపై గతంలో పెద్దఎత్తున ఆందోళనలు జరిగినప్పటికీ.. ఇటీవలి కాలంలో దీనిపై పెద్దగా చర్చలేదు. తాజాగా అఫ్గన్‌‌లో పరిస్థితుల వేళ ఈ అంశం మరోసారి తెరపైకి వస్తోంది. తాలిబన్లు అధీనంలోకి వెళ్లిన తర్వాత అఫ్గనిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఆపరేషన్ భారత్ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆదివారం కాబూల్ నుంచి 168 మంది ప్రయాణికులు సురక్షితంగా భారత్‌ చేరుకున్నారు. వీరిలో 107 మంది భారతీయులు, 28 మంది అఫ్గన్ పౌరులు ఉన్నారు. అలాగే కాబూల్‌ నుంచి కతార్‌, తజకిస్థాన్‌ మీదుగా మరో 200 మంది సైతం భారత్‌లో అడుగుపెట్టారు. గతవారం జరిగిన క్యాబినెట్ కమిటీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘భారత్ కేవలం తన పౌరులనే రక్షించడం కాదు.. భారత్‌కు రావాలనుకును సిక్కు, హిందూ మైనార్టీలకు శరణార్థం కల్పిస్తుంది.. అఫ్గన్ సోదరులు, సోదరిలకు వీలైనంత మేర సహాయం చేస్తుంది’ అని అన్నారు. ప్రకారం.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మత వివక్ష ఎదుర్కొంటూ 2014, డిసెంబర్ 31 లోపు భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రై స్తవులకు భారత పౌరసత్వం కల్పిస్తారు.


By August 23, 2021 at 07:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/union-minister-hardeep-singh-puri-sensational-comments-caa-act-over-afghan-crisis/articleshow/85551273.cms

No comments