నాకు ఫ్రీ పబ్లిసిటీ.. అట్రాసిటీ కేసుపై దాసరి అరుణ్ కుమార్
దర్శకరత్న దాసరి నారాయణరావు కుమారులు ఎప్పుడూ కూడా వార్తల్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంటారు. ఆస్థుల గొడవలు, పంపకాల విషయం మీడియాలో ఎంతటి సంచలనంగా మారాయో అందరికీ తెలిసిందే. తాజాగా దాసరి చిన్న కుమారుడు అరుణ్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదు అయిందనే వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోగా కులం పేరుతో దూషించాడని ఆయన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో రెండ్రోజుల క్రితం నర్సింహులు వెంకటేష్ ఫిర్యాదు చేశారనే వార్తలు బయటకు వచ్చాయి. దాంతో మీద ఐపీసీ 504, 506, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయిందనే వార్తలు బుధవారం హల్‌చల్ చేశాయి. అయితే వీటిపై దాసరి అరుణ్‌కుమార్ స్పందించారు. అవన్నీ రూమర్లనేని ఆ వార్తలను కొట్టిపారేశారు. ఆ వ్యక్తి ఎవరో తనకు తెలిదని అరుణ్ క్లారిటీగా చెప్పారు. ఈ విషయంపై పోలీసులు తనకు ఫోన్ చేసి అడిగారని కూడా అరుణ్ తెలిపారు. ‘అతను ఎవరో నాకు తెలీదు అని పోలీసులకు చెప్పాను. వాళ్లు ఎంక్వైరీ చేస్తామన్నారు. కేసు నమోదు అయిదే బంజారాహిల్స్ పి.ఎస్‌లో ఎఫ్‌ఐఆర్ ఉంటుంది కదా? పైగా అతను గురువుగారి(దాసరి నారాయణరావు) దగ్గర ఎప్పుడు పని చేసాడో కూడా తెలీదు. గురువుగారు సినిమాలకు నేనెప్పుడూ ప్రొడక్షన్ పనులు చూసుకోలేదు. తెలియని వ్యక్తికి నేనేలా డబ్బులు ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా నాకు ఫ్రీ పబ్లిసిటీగా ఉపయోగపడుతుంది’ అని అరుణ్‌కుమార్ తెలిపారు.
By August 18, 2021 at 10:30PM
No comments