హోటల్ రూములో నగ్నంగా వీడియోలు! బలవంతంగా యువ నటి చేష్టలు.. ఇండస్ట్రీలో మరో సంచలనం
ఓ వైపు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కేసు సినీ వర్గాల్లో సంచలనంగా మారగా, ఇప్పుడు అనూహ్యంగా మరో యువనటి పోర్న్ రాకెట్ కేసు తెరపైకి రావడంతో అంతా షాకవుతున్నారు. యువ నటి నందితా దత్తాపై ఓ మోడల్ సంచలన ఆరోపణలు చేసింది. తనను బలవంతం చేసి న్యూడ్ వీడియోలు షూట్ చేసిందని చెప్పడంతో పోలీసులు ఈ ఇష్యూపై కఠిన చర్యలు తీసుకున్నారు. నందితా దత్తాతో పాటు ఆమె అసిస్టెంట్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. నందితా దత్తా, ఆమె ఫొటోగ్రాఫర్ మైనిక్ ఘోష్ ఇద్దరూ కలిసి కొంతమంది మోడల్స్‌తో బలవంతంగా ఓ స్టూడియోలో న్యూడ్ వీడియోలు చేసి వాటిని పోర్నోగ్రఫీ వెబ్ సైట్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు తెలియడంతో పోలీసులు అటాక్ చేశారు. న్యూడ్ ఫొటోషూట్ జరిగిన స్టూడియో ఓనర్ బలిగంజ్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని.. న్యూటౌన్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. స్టూడియోలోని కెమెరా, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకొని పలు విషయాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు. నందితా దత్తా, తనను బలిగంజ్ స్టూడియోకి తెచ్చి బలి చేసిందని సదరు మోడల్ ఆరోపించింది. తనతో న్యూడ్ వీడియో బలవంతంగా చేయించారని, వద్దని వారిస్తున్నా అస్సలు వినలేదని చెప్పింది. అంతేకాదు తన ఫ్రెండ్స్‌లో ఓ యువతికి వెబ్ సిరీస్ ఆఫర్ ఇప్పిస్తానని చెప్పి కోల్‌కతాలోని న్యూ టౌన్ హోటల్‌కి తీసుకెళ్లి అక్కడి హోటల్ రూములో ఆమెతో నగ్న వీడియోలు షూట్ చేయించిందని ఆమె ఆరోపించింది. దీంతో సినీ ఇండస్ట్రీలో పోర్న్ రాకెట్ వ్యవహారం సంచలనంగా మారింది.
By August 01, 2021 at 10:31AM
No comments