రాజ రాజ చోర ట్విట్టర్ రివ్యూ: శ్రీ విష్ణు నటనపై ఆడియన్స్ కామెంట్.. చోరుడు జనాల మనసు దోచుకున్నాడా..?
కెరీర్ ఆరంభం నుంచే డిఫరెంట్ కంటెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో . ఆయన ఎంచుకునే కథలు, చేసే సినిమాల మీద తెలుగు ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉంటాయి. అదే బాటలో ఈ సారి మరో డిఫరెంట్ సినిమా '' చేశారు. హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో , హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మొదటి నుంచే ఆసక్తి రేపే అప్‌డేట్స్ రిలీజ్ చేస్తూ అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్.. ఈ రోజు (ఆగస్టు 19) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటికే ప్రీమియర్ షోస్, స్పెషల్ షోస్ చూసేసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా ఈ సినిమాపై తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. వాటిని బట్టి చూస్తే 'రాజ రాజ చోర'కు ఫస్ట్ టాక్ పాజిటివ్ గానే వచ్చిందని అర్థమవుతోంది. ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసిన శ్రీ విష్ణు.. చెప్పిందే చేసి చూపించారని అంటున్నారు ఆడియన్స్. చిత్రంలో ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోయిందనే టాక్ బయటకొచ్చింది. సినిమా మొత్తం ఫన్, ఎమోషన్‌తో పాటు కొన్ని సస్పెన్స్ సీన్లతో ఆకట్టుకుందని ట్వీట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా శ్రీ విష్ణు, సునైనా తమ తమ పాత్రలకు న్యాయం చేశారట. కొత్త దర్శకుడైనా తొలి సినిమాతోనే హసిత్ గోలి సూపర్ స్క్రిప్ట్ రాసుకొని ప్రేక్షకుల ముందుంచారని చెబుతున్నారు. ఫస్టాఫ్ అంతా కామెడీ సీన్లతో కడుపుబ్బా నవ్వించిందని, ప్రీ ఇంటర్వెల్ సీన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాలో హైలైట్ పాయింట్స్ అనే టాక్ బయటకొచ్చింది. సెకండాఫ్ ఎమోషనల్ సీన్స్ కట్టిపడేశాయని అంటున్నారు. మొత్తంగా చూస్తే శ్రీ విష్ణు కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని కొందరు ట్వీట్స్ చేస్తుండటం సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేసినట్లే అని చెప్పుకోవచ్చు. 'సమయం తెలుగు' పూర్తి రివ్యూ మరి కాసేపట్లో మీ ముందుకు తీసుకురాబోతున్నాం.
By August 19, 2021 at 07:54AM
No comments