Breaking News

మహిళల హాకీ జట్టుకు గుజరాత్ వజ్రాల వ్యాపారి బంపరాఫర్.. ఒక్కొక్కరికి ఏన్ని లక్షలంటే?


టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకుంది. లీగ్‌లో వరుస మూడు మ్యాచ్‌లూ ఓడిపోయినా.. అనూహ్యం పుంజుకుని సెమీస్‌కు చేరింది. సెమీ ఫైనల్స్‌లో బలమైన ఆర్జెంటీనాకు గట్టిపోటీనిచ్చింది. ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో భారత మహిళల జట్టు ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ రాణి రాంపాల్‌ సేన పోరాటానికి దేశం మెత్తంగా అండగా నిలిచింది. మహిళా బృందం అద్భుత ప్రదర్శనకు యావత్‌ దేశం జైకొట్టింది. ఈ క్రమంలో మహిళల హాకీ జట్టులోని సభ్యులకు గుజరాత్‌ వజ్రాల వ్యాపారి ఇల్లు, కారును అందిస్తామని హామీ ఇచ్చారు. తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఏటా దీపావళికి ఖరీదైన కానుకలు, భారీగా బోనస్‌లు ఇస్తూ వార్తలోల నిలిచే వజ్రాల వ్యాపారి .. భారత హకీ జట్టులోని అమ్మాయిలు సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ఒక్కొక్కరికి 11 లక్షల చొప్పున ఇస్తానని ప్రకటించారు. ఇప్పటికే ఇల్లు ఉన్నవారికి రూ. 5 లక్షల విలువచేసే కారు అందజేస్తామని హామీ ఇచ్చారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి భారత హాకీ జట్టు క్రీడాకారిణులకు ఒక్కొక్కరికి అదనంగా రూ.లక్ష ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు ప్రకటించారు. భారత హాకీ చరిత్రలో తొలిసారిగా అమ్మాయిల బృందం ఒలింపిక్స్‌లో సెమీస్‌కు చేరింది. అంచనాలతో సెమీ ఫైనల్లో బరిలోకి దిగిన రాణి రాంపాల్‌ సేన బుధవారం జరిగిన హోరా హోరీ పోరులో ప్రపంచ నంబర్‌వన్‌ అర్జెంటీనాతో పోరాడి ఓడింది. స్వర్ణ పతక పోరాటం నుంచి నిష్క్రమించిన భారత మహిళల హాకీ బృందం శుక్రవారం జరగబోయే కాంస్య పతక పోరులో బ్రిటన్‌తో తలపడనుంది. భారత మహిళల స్ఫూర్తిదాయక విజయానికి‘నా హృదయం గర్వంతో ఉప్పొంగింది.. నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుని మన మహిళా హాకీ జట్టు సభ్యులను సత్కరించాలని నిర్ణయించుకున్నాను.. తన కలల ఇంటిని నిర్మించాలనుకునే ప్రతి క్రీడాకారిణికి రూ.11 లక్షల ఆర్దిక సహాయం అందిస్తాం.. టోక్యో 2020లో మన అమ్మాయిలు చరిత్రను లిఖించారు.... మన ఆటగాళ్ల మనోధైర్యాన్ని పెంచడానికి ఇది మా వినయపూర్వకమైన ప్రయత్నం’ అని సావ్జీ ధోలాకియా ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. సావ్జీ ధోలాకియా ప్రకటన చేసిన కొద్ది సేపటికే ఆయన సోదరుడి స్నేహితుడు అమెరికాలో ఉన్న డాక్టర్ కమలేశ్ దవే ఒక్కొక్కరికి రూ.లక్ష ప్రకటించారు.. ఈ విషయాన్ని సావ్జీ వెల్లడించారు. ‘భారతీయ క్రీడాకారులకు సహాయం చేస్తున్న అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. ఇది మా ఆటగాళ్ల మనోధైర్యాన్ని పెంచడమే కాకుండా రాబోయే టోర్నమెంట్‌లలో మెరుగైన ఆటతీరును కనబరచడానికి కూడా సహాయపడుతుంది’ అన్నారు.


By August 06, 2021 at 07:15AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/gujarat-diamond-merchant-savji-dholakia-promises-houses-cars-for-womens-hockey-team/articleshow/85088478.cms

No comments