నిజంగా నేనలాంటి దాన్ని కాదు.. కానీ అందరి దృష్టిలో! నివేదా పేతురాజ్ ఓపెన్ కామెంట్స్
కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది . ఈ ఏడాది సంక్రాంతికి ‘రెడ్’ సినిమాతో సందడి చేసిన ఈ బ్యూటీ.. ఆగస్టు 14వ తేదీన '' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆమె తాజాగా ఇంటర్వ్యూలో తన కెరీర్ విశేషాలపై ఓపెన్ అయింది. రెండేళ్ల క్రితమే ‘పాగల్’ కథ విన్నానని చెప్పిన నివేదా పేతురాజ్.. ఈ సినిమా చేస్తున్నప్పుడు మంచి సినిమా, మంచి పాత్ర చేస్తున్నాననే ఫీల్ కలిగిందని చెప్పింది. డైరెక్టర్ నరేష్ ఈ సినిమా కథను ఐదు సార్లు నేరేట్ చేశారని, ఆ కథ వింటున్నప్పుడే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యానని తెలిపింది. కథ విన్న ఆ ఐదు సార్లు కంటతడి పెట్టుకున్నానని చెప్పిన నివేదా.. ఈ మూవీలో తన క్యారెక్టర్ సీరియస్‌గా ఉంటుందని తెలిపింది. గతంలో కూడా ''మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల.. వైకుంఠపురములో'' లాంటి సినిమాల్లో దాదాపు సీరియస్ క్యారెక్టర్సే చేశానని, ‘పాగల్’లోనూ అలాంటి క్యారెక్టరే చేశానని చెప్పుకొచ్చింది. ''అదేంటో నా లుక్స్, ప్రవర్తన చూసి నాకు సీరియస్ క్యారెక్టర్స్ అయితే బాగా సూట్ అవుతాయని భావిస్తున్నారేమో అందుకే అన్నీ అలాంటి పాత్రలే ఇస్తున్నారు. చూడటానికి సీరియస్ అమ్మాయిలా కనపడినా నిజంగా నేనలాంటిదాన్ని కాదు'' అని నివేదా చెప్పడం గమనార్హం. నరేశ్ కుప్పిలి దర్శకత్వంలో రూపొందిన 'పాగల్' సినిమాలో జోడీగా నివేదా పేతురాజ్ నటించింది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అర్జున్ రెడ్డి ఫేమ్ రాధన్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.
By August 10, 2021 at 10:34AM
No comments