Breaking News

ఉదయాన్నే ఓ గంటసేపు అలా.. సెట్‌లో శర్వా చేసిన దానికి షాక్ : రష్మిక


ఈ మధ్య ఓ పని రెగ్యులర్‌గా చేస్తున్నారు. తన అభిమానులకు రోజంతా తానేమీ చేశారో చెబుతూ డైరీ లాంటిది రాస్తున్నారు. ఆ రోజంతా తాను ఏ ఏ పనులు చేసిందో చెబుతూ అన్ని విషయాలను పంచుకుంటారు. లేచిన క్షణం నుంచి నిద్ర పోయే వరకు ఏ పనులు చేశారో..ఎవరిని కలిశారో.. ఏ షూటింగ్‌లో పాల్గొన్నారో చెప్పుకొస్తారు. అలా తాజాగా రష్మిక తన డైరీని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆగస్ట్ 19న తాను చేసిన పనులు ఏంటి? ఆ రోజంతా ఎలా గడిచిందో రష్మిక చెప్పుకొచ్చారు. మామూలుగా రష్మిక రోజూ ఇలా డైరీని పంచుకోవాలని అనుకుంటారు. కానీ వారానికి ఒకసారి లేదా తనకు ఎప్పుడు వీలైతే అప్పుడు మాత్రమే ఇలా డైరీతో ముందుకు వస్తారు. ఇందులో ఒక్కొక్క పాయింట్‌ ద్వారా రోజూవారి కార్యక్రమాలను చెబుతుంటారు. పొద్దున్నే లేచాను, వ్యాయామం చేశాను.. ఆరాతో ఆడుకున్నాను..సెట్‌కు వెళ్లి వచ్చాను.. సాయంత్రం ఫ్రెండ్స్‌ను కలిశాను అంటూ ఇలా తన లిస్ట్ అంతా కూడా బయటపెడుతుంది. తాజాగా ఆగస్ట్ 19 ఎలా గడిచిందో చెప్పుకొచ్చారు. ఈరోజు నా మొహం మీద చిరునవ్వు రావడానికి కొన్ని కారణాలున్నాయి. నేను ఉదయం లేవగానే ఓ గంటపాటు యోగా చేశాను. సెట్‌కు సరైన టైంకు వెళ్లాను. ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను. అదంతా ఎంతో సరదాగా గడిచింది. సెట్‌లో తన పెట్‌ను తీసుకొచ్చారు. ఎంతో ఆశ్చర్యపోయాను. షాకింగ్‌గా అనిపించింది. అదెంతో క్యూట్‌గా ఉంది. నేను ఇంటికి తిరిగి వెళ్లిన తరువాత ఆరా తన తోకను ఎందుకు అలా ఊపుతుందో నాకు తెలిసివచ్చింది. షూట్ నుంచి వచ్చాక ఓ అర్దగంట పాటు వ్యాయామం కూడా చేయగలిగాను. నా ఇద్దరు స్నేహితులతో కలిసి డిన్నర్ కూడా చేశాను. ఆరా కూడా మాతోనే లాగించేసింది. ఆ తరువాత ఓపిక లేకపోవడంతో ఎక్కువ ఆడుకోకుండానే ఆరా, నేను పడుకున్నామని రష్మిక చెప్పుకొచ్చారు.


By August 21, 2021 at 08:35AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rashmika-mandanna-about-sharwanand-on-set/articleshow/85506438.cms

No comments