Breaking News

చెల్లెలిగా చిరంజీవి వద్దన్నారు.. పెళ్లయ్యాక సమస్యలు.. చేతబడి చేయడంతో! రహస్యాలు బయటపెట్టిన హీరోయిన్


హీరోయిన్ అనగానే అంతా గుర్తుపట్టకపోవచ్చు గానీ బాలకృష్ణ క్లాసిక్ మూవీ 'ఆదిత్య 369' హీరోయిన్‌ అంటే అంతా ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆ తర్వాత తెలుగులో మోహన్ బాబు హీరోగా వచ్చిన 'డిటెక్టివ్‌ నారద'లో నటించి ఫేమ్ అయిన ఆమె తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించారు. కోట్ల మంది హిందువులకు గురువైన రమణ మహర్షికి వరసకు మనమరాలైన ఈ మోహిని జీవితంలో మలుపులెన్నో. ఒకానొక సమయంలో ఆమెకు చేతబడి కూడా చేశారట. అయితే తాను క్రైస్తవం బాట పట్టడానికి వెనకున్న కారణాల గురించి, అలాగే తన సినీ కెరీర్ గురించిన ముచ్చట్లను చెబుతూ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు మోహిని. శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన తాను 13 ఏళ్ల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసినట్లుగా చెప్పిన మోహిని.. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సినిమాల్లోకి రావడం కారణంగా చుట్టాల నుంచి చాలా వ్యతిరేకత వచ్చిందని, చాలామంది మాట్లాడటం కూడా మానేశారని చెప్పారు. తాను నాగార్జున ఫ్యాన్ అని చెప్పిన ఆమె, ఓ సందర్భంలో అన్న మాటను గుర్తు చేశారు. ''చిరంజీవి పక్కన హీరోయిన్‌గా చేయలేకపోయా! అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ‘హిట్లర్‌’ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కొద్దిలో మిస్‌ అయింది. చెల్లెలి పాత్ర ఇచ్చారు. అప్పుడు నిన్ను చెల్లెలి పాత్ర ఎవరు చేయమన్నారు.. వద్దు అని చిరంజీవి గారు అన్నారు. కానీ సుహాసిని గారు కలగజేసుకొని.. నేను మీకు చెల్లెలిగాను, హీరోయిన్‌ గాను చేశాను కదా అని ఆయన్ను ఒప్పించారు. ఆ తర్వాత చిరుతో హీరోయిన్‌గా చేసే అవకాశం లభించలేదు'' అని మోహిని అన్నారు. ఇకపోతే పెళ్లి తర్వాత తన మానసిక స్థితి గురించి ఓపెన్ అయిన మోహిని.. పెళ్ళైన ఐదేళ్లకు అనేక మానసిక సమస్యలు ఎదురయ్యాయని, రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేశానని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నానో తనకే తెలిసేది కాదని, చివరకు ఓ జ్యోతిష్కుడికి చూపించగా చేతబడి చేశారని ఆయన చెప్పినట్లుగా మోహిని తెలిపారు. అనేక పూజలు, ప్రార్థనలు చేసి యేసు ప్రభును నమ్ముకున్నానని, అప్పటినుంచి మానసిక సమస్యలు దూరమయ్యాయని ఆమె తెలిపారు. మంచి అవకాశం లభిస్తే సినిమాల్లో నటించేందుకు రెడీ అని ఆమె అన్నారు.


By August 01, 2021 at 12:42PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-mohini-says-her-personal-life-secrets/articleshow/84941614.cms

No comments