Breaking News

సీక్రెట్‌గా హీరో కార్తికేయ ఎంగేజ్‌మెంట్.. ఆన్ లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఫొటో.. ఆ అమ్మాయి ఎవరంటే!


లాక్ డౌన్ వేళ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. యంగ్ హీరోలు నితిన్, నిఖిల్, రానా దగ్గుబాటి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ లిస్టులో మరో యంగ్ హీరో చేరబోతున్నారు. తొలిసినిమా RX 100 తోనే తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న పెళ్లి కన్ఫమ్ అయింది. సీక్రెట్‌గా అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఆయన ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌లో వేడుక జరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిగిన ఈ వేడుకలో వధూవరుల కుటుంబ సభ్యులతోపాటు అతి తక్కువ మంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. తమ కుటుంబానికి సన్నిహితులైన కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని ఇష్టపడిన కార్తికేయ.. పెళ్లికి సిద్దమైనట్లు సమాచారం. పెద్దలు కూడా వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పెద్దగా హడావుడి లేకుండా సైలెంట్‌గా నిశ్చితార్థం ఫినిష్ చేశారట. ఈ వేడుకకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో లీక్ కావడంతో కార్తికేయ ఎంగేజ్‌మెంట్ మ్యాటర్ బయటపడింది. ఇందులో కార్తికేయ తనకు కాబోయే భార్యతో సంతోషంగా స్టిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిశ్చితార్ధ వేడుకకు సినీ ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ హాజరు కాలేదని సమాచారం. త్వరలోనే తన పెళ్లి విషయమై ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నారట కార్తికేయ. హీరోగానే కాకుండా విలన్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అంటున్న కార్తికేయ.. ప్రస్తుతం “రాజా విక్రమార్క” సినిమా చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం అతిత్వరలో విడుదల కానుంది.


By August 23, 2021 at 11:24AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/viral-pic-kartikeya-gummakonda-engagement-ceremony/articleshow/85554825.cms

No comments