‘మేం కొడితే మళ్లీ తిరిగి రాలేరు’ బీజేపీకి ఉద్థవ్ ఠాక్రే స్ట్రాంగ్ కౌంటర్
బీజేపీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. భయపెట్టేలా భాషను సహించబోమని, అలా మాట్లాడే వారికి తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. అవసరమైతే సెంట్రల్ ముంబయిలోని శివసేన భవన్‌ను కూల్చివేయాలని ఎమ్మెల్యే ప్రసాద్ లాడ్ వ్యాఖ్యలు చేయడంతో ఉద్ధవ్ పైవిధంగా స్పందించారు. అయితే, తర్వాత తన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. మీడియా ముందు తాను సంయమనం కోల్పోయానని, ఏం మాట్లాడో తనకే తెలియదని అన్నారు. ఆదివారం చ్వాల్ పునరాభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. మూడు పార్టీల మహావికాస్ అఘాడీ సర్కారును ట్రిపుల్ సీట్ ప్రభుత్వంగా పేర్కొన్నారు. ‘అవతలి వ్యక్తి తిరిగి మాట్లాడలేకపోయేలా మేం గట్టిగా తిడతాం.. కాబట్టి ఎవరూ మమ్మల్ని భయపెట్టే భాషను ఉపయోగించవద్దు’ అని దబాంగ్ సినిమాలోని ‘చెంపదెబ్బకు భయపడబోం’ అనే డైలాగ్‌తో బీజేపీకి చురకలంటించారు. పునరాభివృద్ధి ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత లబ్ధిదారులను ఏలా ఆకర్షిస్తారని అడిగిన ప్రశ్నకు ఉద్ధవ్ స్పందిస్తూ..‘చ్వాల్స్ చారిత్రక వారసత్వం.. సంయుక్త మహారాష్ట్ర కోసం తమ జీవితాలనే త్యాగంచేసిన ఘనత వారి సొంతం.. చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉన్న మరాఠీ సంస్కృతి కాపాడటానికి ఎంతైనా ఖర్చుచేస్తాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్‌సీపీ అధినేత కూడా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. బీడీడీ చ వారసత్వం పరిరక్షణ.. మరాఠీ ప్రజలు పునరాభివృద్ధి చేసిన ఇళ్లలోకి తిరిగి రావాలి.. ఈ ప్రాజెక్ట్ మహారాష్ట్ర హౌసింగ్, ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా పర్యవేక్షించబడుతుందని అన్నారు. కోవిడ్-19 సంక్షోభం, వరదలను ఎదుర్కొవడంలోనూ ఉద్ధవ్ ఠాక్రే సమర్ధవంతంగా వ్యవహరించారని కితాబిచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు ఉన్నప్పటికీ మహావికాస్ అఘాడీ ప్రభుత్వం అభివృద్ధి పనులను నిలిపివేయలేదని రాష్ట్ర రెవెన్యూ మంత్రి బాలా సాహెబ్ థోరట్ అన్నారు.
By August 02, 2021 at 12:10PM
No comments