విగ్నేష్‌తో లవ్ ఎఫైర్‌పై నయనతార రియాక్షన్.. పెళ్లిపై తొలిసారి ఓపెన్! అసలు విషయం బట్టబయలు
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతూ పలు భాషల్లో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేస్తూ వస్తోంది . గత పదిహేడేళ్ళుగా ఆమె సినీ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరో రేంజ్ ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్.. ప్రేమ, పెళ్లి విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు వెనకడుగు వేస్తూనే ఉంది. తీరా రేపో మాపో నయన్ పెళ్లి అవుతుందని అంతా ఫిక్సయ్యాక సడెన్ షాకిస్తోంది. దీంతో ఆమె పెళ్లి ముచ్చట్లకు నిత్యం వార్తల్లో ఎక్కడో చోట స్పేస్ ఉంటూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లి మ్యాటర్‌పై రియాక్ట్ అయింది నయన్. ప్రస్తుతం నయనతార నటిస్తోన్న ‘నెట్రికన్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్టు 13 నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ ప్రసారం కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నయన్.. తొలిసారి తన ఎంగేజ్‌మెంట్‌పై రియాక్ట్ అయింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఆమె, విగ్నేష్‌తో రిలేషన్‌పై ఓపెన్ అవుతూ అసలు విషయం బయట పెట్టేసింది. దీంతో ఈ షో తాలూకు ప్రోమో వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. మొదట హీరో శింబుతో ప్రేమాయణం నడిపించిన నయనతార.. అనంతరం వాళ్ళిద్దరి మధ్య బేదాభిప్రాయాలు రావడంతో విడిపోయినట్లు రూమర్స్ గట్టిగానే వినిపించాయి. అనంతరం ప్రభుదేవాతో ప్రేమలో మునిగితేలుతూ ఆల్‌మోస్ట్ పెళ్లి దాకా వచ్చి ఆయనకు బ్రేకప్ చెప్పేసింది నయనతార. దీంతో నయన్ లవ్ మ్యాటర్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతలో డైరెక్టర్ విగ్నేష్ శివన్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకునే వరకూ వచ్చేసింది. ఈ ఇద్దరి రొమాంటిక్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో గతేడాది నుంచి నయన్- విగ్నేష్ పెళ్లిపై ఎన్నో కథనాలు వస్తున్నాయి. త్వరలోనే పెళ్లి పీటలెక్కేస్తున్నారని, ఇరు కుటుంబాల అంగీకారం కూడా లభించిందనే టాక్ వచ్చింది. ఇంతలో రీసెంట్‌గా నయన్ ఎంగేజ్‌మెంట్ రింగ్ అంటూ ఓ ఫొటో వైరల్ కావడం, కాస్త ఫైనాన్సియల్‌గా స్ట్రాంగ్ అయ్యాక పెళ్లి చేసుకుంటామని విగ్నేష్ చెప్పడంతో అతి త్వరలో వీళ్ళ పెళ్లి ఖాయం అని ఓ క్లారిటీ వచ్చేసింది. సరిగ్గా ఈ తరుణంలో లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపిస్తూ తెగ సిగ్గుపడింది నయనతార. అలాగే రొమాంటిక్ పార్టనర్ విఘ్నేష్ శివన్‌పై ఎదురైన ప్రశ్నలకు ఇష్టంగా సమాధానాలు చెప్పింది. పెళ్లి విషయమై నయన్ నుంచి వచ్చిన తొలి హింట్ ఇదే కావడంతో ఈ వీడియో తెగ హల్చల్ చేస్తోంది.
By August 11, 2021 at 07:50AM
No comments