పాక్‌లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. రంగంలోకి పోలీసులు.. సైబర్ క్రైం కన్ను? అసలేంటి మ్యాటర్
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ హీరోల ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. తమ హీరోపై అభిమానం చాటుకునేందుకు గాను సోషల్ మీడియా హ్యాండిల్స్ ఫుల్లుగా వాడేస్తున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా పవర్ స్టార్ చేసే హడావిడి అంతా ఇంతాకాదు. తమ హీరో మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేయడంతో ట్విట్టర్‌లో పేరును తెగ సర్క్యులేట్ చేస్తూ మోత మోగిస్తున్నారు. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా తాజాగా పాక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ ఓ ట్విట్టర్ ఖాతా ప్రత్యక్షం కావడంతో అంతా షాకయ్యారు. అలాగే ఆ ప్రొఫైల్ పిక్ చూసి ఆశ్చర్యపోయారు. చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్‌కి ఎల్లలుదాటి ఫ్యాన్స్ ఉండటమనేది సాధారణమైన విషయమే కానీ ఇలా 'పాక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్' పేరుతో ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేయడమే షాకింగ్ పరిణామం. పైగా ఇక మేము ట్విట్టర్‌లో ఎంటర్ అయ్యాం అంటూ వాళ్ళు పెట్టిన ట్యాగ్ లైన్ చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ ఖాతా ఎక్కడినుంచి ఓపెన్ అయింది అనే దానిపై పోలీసులు కన్నేశారు. ఎవరైనా కావాలనే ఇలా చేశారా? అనే కోణంలో ఆలోచించి పోలీసులు రంగంలోకి దిగారు. వాళ్ళు పెట్టిన ట్వీట్‌ని సైబర్ క్రైం విభాగానికి ట్యాగ్ చేశారు. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. పాకిస్తాన్‌లో కూడా పవన్ ఫ్యాన్స్ అంటే ఉస్తాద్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. రీ- ఎంట్రీ తర్వాత ఇటీవలే 'వకీల్ సాబ్' సినిమాతో సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రానాతో కలిసి 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమా తెలుగు రీమేక్ షూటింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' సినిమా ఫినిష్ చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులతో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మరో సినిమా చేయనున్నారు పవన్.
By August 10, 2021 at 12:09PM
No comments