ఫేమస్ ప్లే బ్యాక్ సింగర్ కళ్యాణి మీనన్ కన్నుమూత.. సినీ ప్రముఖుల సంతాపం
సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ తల్లి, ప్రముఖ (80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం రోజు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఆమె మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన కళ్యాణి మీనన్.. తమిళం, మలయాళంలో 100కి పైగా సినిమాల్లో పాటలు పాడారు. 1990, 2000 సంవత్సరాల మధ్యకాలంలో ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, దేవరాజన్, విద్యాసాగర్ సంగీత సారథ్యంలో ఆమె ఆలపించిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. 'కాదలన్', 'ముత్తు', 'ఏక్ దీవానా థా' లాంటి చిత్రాలలో ఆమె పాడిన పాటలకు భారీ క్రేజ్ దక్కింది. ఎక్కువగా ఏఆర్ రెహమాన్ సినిమాలకు పాటలు పాడిన కళ్యాణి మీనన్.. జేసుదాసుతో కూడా కలిసి పనిచేశారు. సినిమాలతో పాటు పలు ప్రైవేట్ డివోషనల్ సాంగ్స్ ఆలపించిన ఆమె ''గురువాయూరప్పన్ సుప్రభాతం, నారాయణీయం, ముకుందమాల'' లాంటి ఆల్బమ్స్‌లో భాగమయ్యారు.
By August 03, 2021 at 12:35PM
No comments