Breaking News

BJP ఎంపీగా కొనసాగుతా.. యూటర్న్ తీసుకున్న బాబుల్ సుప్రియో


రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు రెండు రోజుల కిందట సంచలన ప్రకటన చేసిన కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతానని ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సోమవారం సమావేశమైన అనంతరం బాబుల్ ఈ ప్రకటన చేశారు. అంతేకాదు, రాజ్యాంగపరమైన బాధ్యతను మాత్రం నిర్వర్తిస్తాను.. రాజకీయాల్లో మాత్రం క్రియాశీలకంగా ఉండబోనని ఆయన పునరుద్ఘాటించారు. ఢిల్లీలోని ఎంపీ బంగ్లాను ఖాళీచేసి, భద్రతా సిబ్బందిని కూడా వెనక్కి ఇచ్చేయనున్నట్లు చెప్పారు. ‘ఎంపీగా కొననసాగుతాను.. కానీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండబోను.. రాజ్యాంగబద్ధమైన పదవిని కొనసాగిస్తాను.. ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు చేపట్టకుండానే రాజ్యాంగపరమైన బాధ్యతలను నిర్వర్తిస్తాను.. ఏ రాజకీయ పార్టీలోనూ చేరను.. ఢిల్లీలో ఎంపీ బంగ్లాను ఖాళీచేసి కోల్‌కతా లేదా ముంబయికి షిఫ్ట్ అవుతాను’ అని తెలిపారు. బీజేపీ నుంచి రాజకీయ అరంగేట్రం నుంచి బాలీవుడ్ గాయకుడు బాబుల్ సుప్రియో.. పశ్చిమ్ బెంగాల్‌లోని అసన్‌సోల్ పార్లమెంట్ నియోజవర్గం నుంచి రెండుసార్లు ఎన్నికయ్యారు. తొలిసారి 2014 ఎన్నికల్లో గెలిచిన నుంచి మోదీ క్యాబినెట్‌లో వివిధ పదవులు నిర్వహించారు. అయితే, ఇటీవల మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఆయనను క్యాబినెట్ నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గం నుంచి తప్పించడంతో నిరాశ చెందిన బాబుల్ సుప్రియో రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటన చేసి ఉంటారని తెలుస్తోంది. రెండు రోజుల కిందట తన రాజీనామా విషయాన్ని ఆయన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. ‘గుడ్ బై... ఏ ఇతర పార్టీల్లోనూ చేరడం లేదు. చేరమని నన్నెవరూ సంప్రదించలేదు. ఎందులోనూ చేరడం లేదు. నేనెప్పుడూ ఒకే పార్టీకి చెందినవాడిని. సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. అయితే సేవ చేయాలంటే రాజకీయాల్లోనే ఉండాలన్న నిబంధన ఏమీ లేదు. రాజకీయేతర రంగంలో ఉంటూ కూడా సేవ చేయొచ్చు’ అంటూ బాబుల్ సుప్రియో పోస్ట్ చేశారు. అయితే కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా అని నెటిజన్లు ప్రశ్నించగా.. అది కూడా ఓ కారణమై ఉండవచ్చని సుప్రియో సమాధానం ఇవ్వడం గమనార్హం. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన రాజకీయ జీవితంలో చాలా హామీలను నెరవేర్చినా.. కొన్నింటిని మాత్రం నెరవేర్చలేకపోయానన్నారు. అలాగే కొందరిని సంతోష పెట్టి ఉండొచ్చనని, మరికొందరిని బాధ పెట్టి ఉండొచ్చనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, బాబుల్ సుప్రియో ప్రకటనను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. ఇదంతా డ్రామా అని విమర్శించింది. ఆయన్ని కేంద్ర కేబినెట్ నుంచి తొలగించడంతోనే బీజేపీ నేతల దృష్టిని ఆకర్షించేందుకు ఈ డ్రామా ఆడారని ఎద్దేవా చేసింది. నిజంగా రాజకీయాలను వీడాలనుకునేవారు ఎంపీ పదవిని కూడా వదులుకోవాలని అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు. ఆయన ఇలా వ్యాఖ్యలు చేసిన వెంటనే సుప్రియో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో జరిగిన పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆయనను బరిలోకి దింపింది. దక్షిణ కోల్‌కతాలోని తోలీగౌంగే నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన.. టీఎంసీ అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. బాబుల్ సుప్రియోపై 50 వేల ఓట్ల మెజార్టీతో టీఎంసీ అభ్యర్థి విజయం సాధించారు.


By August 03, 2021 at 07:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ex-union-minister-babul-supriyo-has-had-a-rethink-on-the-second-and-says-will-stay-mp/articleshow/84993654.cms

No comments